Rahul Gandhi : రాయ్ బరేలీ, వయనాడ్ లోనూ ఆధిక్యంలో రాహుల్ గాంధీ..! 100కు సీట్లలో కాంగ్రెస్ లీడ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి తాను పోటీ చేసిన రెండు సీట్లు రాయ్ బరేలీ, వయనాడ్ లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ రాయ్ బరేలీ, వయనాడ్ లోనూ రాహుల్ గాందీ ఆధిక్యం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ప్రత్యర్దులుగా ఉన్న బీజేపీ, కమ్యూనిస్టు అభ్యర్ధులు ఆయనతో పోలిస్తే చాలా దూరంగా ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీ ఈ రెండు సీట్లలోనూ భారీ ఆధిక్యంలో గెలిచే అవకాశాలున్నాయి.

వాయనాడ్‌లో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ.. తొలి రౌండ్ లో 103 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ కంటే రాహుల్ ముందంజలో ఉన్నారు. వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి, కేరళలో ఆ పార్టీ అధినేత కే సురేంద్రన్‌పై రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు. వయనాడ్ స్ధానంలో రాహుల్ పై సీపీఐ సీనియర్ నేత అన్నీ రాజాను రంగంలోకి దింపింది.వీరిద్దరి కంటే రాహుల్ ముందంజలో ఉన్నారు.
మరోవైపు దేశంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈసారి 100 సీట్ల మార్కును దాటింది. ఇవాళ వెలువడుతున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో 2014 తర్వాత కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు సాధించినట్లు లెక్క. కేంద్రంలో 2014లో అధికారం కోల్పోయాక కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మొత్తం మీద బీజేపీతో పోలిస్తే వెనుకంజలోనే ఉంది.












Click it and Unblock the Notifications