ఎన్నికలు: ఓటరు నమోదుకు సులభ మార్గాలు
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 7న ప్రారంభం కానున్న ఎన్నికల పోలింగ్ మే 12న ముగియనుంది. 9 ఫేజ్‌లలో జరుగనున్న ఈ ఎన్నికల్లో 81.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని తదుపరి భారత ప్రధానిని ఎన్నుకోనున్నారు.
అయితే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా ఓటర్ ఐడి(ఓటరు గుర్తింపు కార్డు)ని కలిగి ఉండాలి. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటరు ఐడి కావాలి. ఓటర్ ఐడి కార్డును సులభంగా పొందేందుకు కింది సులభ సూచనలు పాటించాల్సి ఉంటుంది.

మీరు కొత్త ఓటరు అయితే:
మీరు ఇక్కడ ఇన్‌లైన్ రిజిష్టర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Click here for online registration
లేదా
మార్చి 11న ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే శిబిరాల్లో మీ పేరు, వివరాలతో ఫాం-6ను పూర్తి చేసి ఓటర్ జాబితాలో రిజిష్టర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఫాం-6ను పొందవచ్చు. Click here to fill Form 6
మీరు భారతీయులైనప్పటికీ, బయటి దేశంలో నివాసం ఉన్నట్లయితే మీ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవడానికి ఫాం-6ఏను మీ వివరాలతో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫాం-6ఏను పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి Click here to fill Form 6 A
మీ ఓటర్ కార్డులో పేరు, చిరునామాలకు సంబంధించిన వివరాలు తప్పుగా ఉన్నట్లయితే వాటిని సవరించేందుకు ఫాం-8ను సరైన వివరాలతో నింపాల్సి ఉంటుంది. ఫాం-8ను పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click here to fill Form 8
మీరు ప్రస్తుతం ఉన్న చిరునామా మారినట్లయితే.. దాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు ఫాం-8ఏను నింపాల్సి ఉంటుంది. ఫాం-8ఏ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Click here to fill Form 8 A












Click it and Unblock the Notifications