భార్య మీద అనుమానం, స్కూల్ ముందే చంపేసిన జులాయి భర్త, అజ్ఞాతంలోకి, లుకౌట్ నోటీసు !

చండీఘడ్: చండీఘడ్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న భార్యను ఆమె భర్త స్కూల్ ముందే అతి దారుణంగా హత్య చేసి పరారైనాడు. భార్యను హత్య చేసిన భర్తను పట్టుకోవడానికి చండీఘడ్ పోలీసులు గాలిస్తున్నారు. ఎన్ని రోజులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న టీచర్ భర్తను పట్టుకోవడానికి చివరికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలోని భార్యను హత్య చేసిన భర్తను పట్టుకుంటామని చండీఘడ్ పోలీసులు తెలిపారు.

 హ్యాపీ జీవితం

హ్యాపీ జీవితం

చండీఘడ్ లో హర్వీందర్ సింగ్, సరబ్ జీత్ కౌర్ అనే దంపతులు నివాసం ఉండేవారు. సరబ్ జీత్ కౌర్ ఇంటి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. హర్వీందర్ సింగ్, సరబ్ జీత్ కౌర్ దంపతుల జీవితం మొదట హ్యాపీగానే ఉండేది.

జులాయి మొగుడు

జులాయి మొగుడు

హర్వీందర్ సింగ్ మాత్రం భార్య కష్టపడి తీసుకు వచ్చే జీతంతో జల్సాలు చేస్తున్నాడు. ఏ పని చెయ్యకుండా ఇంటిలో టీవీ చూడటం, భార్య సంపాధించిన నగదుతో తాగి తందనాలు ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. అయితే సరబ్ జీత్ కౌర్ మాత్రం భర్త హర్వీందర్ సింగ్ మీద ఉన్న ప్రేమతో చూసిచూడనట్లు ఉండేది. ఇదే మంచి చాన్స్ అంటూ హర్వీందర్ సింగ్ మరింత జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

హర్వీందర్ సింగ్, సరబ్ జీత్ కౌర్ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. నిన్ను అంతం చేస్తానని. ఎక్కువ రోజులు బతకనివ్వనని భర్త హర్వీందర్ సింగ్ పదేపదే భార్యను హెచ్చరిస్తూ వస్తున్నాడు. తాగిన మైకంలో నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్నావని, అందుకే తనను నిర్లక్షం చేస్తున్నావని భార్య సరబ్ జీత్ కౌర్ తో గొడవ పెట్టుకున్నాడు.

 విడిపోయిన దంపతులు

విడిపోయిన దంపతులు

కొంత కాలం క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడం, పెద్దలు పంచాయితీ చేసిన ఫలితం లేకపోవడంతో హర్వీందర్ సింగ్, సరబ్ జీత్ కౌర వేరువేరుగా నివాసం ఉంటున్నారు. భార్య సరబ్ జీత్ కౌర్ తనను విడిచి వేరుంగా ఉంటోందని హర్వీందర్ సింగ్ రగిలిపోయాడు.

స్కూల్ దగ్గరే చంపేసిన భర్త

స్కూల్ దగ్గరే చంపేసిన భర్త

ఇటీవల సరబ్ జీత్ కౌర్ స్కూల్ కు వెళ్లింది. భార్య బయటకు వచ్చిన తరువాత చంపేయాలని హర్వీందర్ సింగ్ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఉద్యోగం పూర్తి చేసుకుని స్కూల్ నుంచి బయటకు వచ్చిన సరబ్ జీత్ కౌర్ ను ఆమె భర్త హర్వీందర్ సింగ్ దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారైనాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ చేసి సరబ్ జీత్ కౌర్ మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

భర్త ఫోన్ నెంబర్ భార్య దగ్గర లేదు

భర్త ఫోన్ నెంబర్ భార్య దగ్గర లేదు

సరబ్ జీత్ కౌర్ ఆమె భర్త హర్వీందర్ సింగ్ కు దూరం అయిన తరువాత కనీసం అతని ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకోలేదని, కనీసం ఇద్దరి మద్య ఎలాంటి మాటలు, పలకరింపులు లేవని ఇద్దరికీ చాల దగ్గర పరిచయం ఉన్న స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరబ్ జీత్ కౌర్ ను దారుణంగా హత్య చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హర్వీందర్ సింగ్ ఆచూకి ఎంతకీ చిక్కకపోవడంతో అతన్ని పట్టుకోవడానికి చండీఘడ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+