బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Love: ప్రేమిస్తావా లేదా ? యువతి మీద యాసిడ్ పోసిన కిరాతకుడు, అన్నా అని పిలిచింది, వీడు మాత్రం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి ముందే పరిచయం ఉంది. ఆ యువతిని ఆ యువకుడు ప్రేమించాడు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు అనుకున్నాడు. తనను ప్రేమించాలని ఆమె మీద అతను ఒత్తిడి చేశాడు. బాగా చదువుకున్న యువతి ఉద్యోగం చేస్తున్నది. వెంటపడుతున్న యువకుడిని ప్రేమించడం ఆమెకు ఇష్టం లేదు. తనను ప్రేమించాలని యువకుడు వెంటపడటంతో ఆమె ఇంట్లో విషయం చెప్పడానికి భయపడింది. ప్రతిరోజు ఉదయం తండ్రి ఆమెను ఆఫీసు దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ రోజు ఉదయం యువతిని డ్రాప్ చేసిన ఆమె తండ్రి బైక్ లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తండ్రి అక్కడి నుంచి వెళ్లి ఒక్క నిమిషం కూడా పూర్తి కాకుండానే ఆ యువకుడు ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు. నన్ను ప్రేమిస్తావా లేదా ?, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ? అని ఆమెను ప్రశ్నించాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఆమె తేల్చి చెప్పింది. అంతే వెంటనే ఆమె మీద యాసిడ్ పోసిన నిందితుడు అక్కడి నుంచి పరారైనాడు, యువతికి తీవ్రగాయాలైనాయని, వారం రోజుల వరకు ఆమె ఆరోగ్యం విషయంలో హామీ ఇవ్వలేమని వైద్యులు అంటున్నారని డీసీపీ చెప్పారు. ఐటీ హబ్ లో మరోసారి యువతి మీద యాసిడ్ దాడి జరగడంతో ప్రజలు హడలిపోయారు.

Illegal affair: కొత్త పెళ్లి కూతురు, పుట్టింటి పక్కన ప్రియుడితో ఎంజాయ్, భార్య చీరతో కొత్త పెళ్లి కొడుకు, అంతేIllegal affair: కొత్త పెళ్లి కూతురు, పుట్టింటి పక్కన ప్రియుడితో ఎంజాయ్, భార్య చీరతో కొత్త పెళ్లి కొడుకు, అంతే

ఒకే ఏరియాలో నివాసం

ఒకే ఏరియాలో నివాసం

బెంగళూరులోని కామాక్షిపాళ్యలో 23 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది, యవతి నివాసం ఉంటున్న ఏరియాలోనే నాగేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, యువతికి, నాగేష్ కు వయసులో 9 సంవత్సరాల తేడా ఉందని తెలిసింది, ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతికి, నాగేష్ కు ముందే పరిచయం ఉంది.

ఎంఏ చదివిన యువతి

ఎంఏ చదివిన యువతి

ఆ యువతిని నాగేష్ ప్రేమించాడు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వన్ సైడ్ లవర్ నాగేష్ అనుకున్నాడు. తనను ప్రేమించాలని ఆమె మీద నాగేష్ ఒత్తిడి చేశాడు. ఎంఏ పూర్తి చేసిన యువతి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. వెంటపడుతున్న నాగేష్ ను ప్రేమించడం ఆమెకు ఇష్టం లేదు. తనను ప్రేమించాలని నాగేష్ మాత్రం ఆమె వెంటపడటంతో ఆమె ఇంట్లో విషయం చెప్పడానికి భయపడింది.

 యువతిని డ్రాప్ చేసిన తండ్రి

యువతిని డ్రాప్ చేసిన తండ్రి

ప్రతిరోజు ఉదయం తండ్రి ఆమెను ఆఫీసు దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం యువతిని ఆమె ఆఫీసు దగ్గర డ్రాప్ చేసిన తండ్రి బైక్ లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె తండ్రి అక్కడి నుంచి వెళ్లి ఒక్క నిమిషం కూడా పూర్తి కాకుండానే నాగేష్ ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు.

 యాసిడ్ పోసి ఎస్కేప్

యాసిడ్ పోసి ఎస్కేప్

నన్ను ప్రేమిస్తావా లేదా ?, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ? అని ఆమెను నాగేష్ ప్రశ్నించాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఆమె నాగేష్ కు తేల్చి చెప్పింది. అంతే వెంటనే ఆమె మీద యాసిడ్ పోసిన నిందితుడు నాగేష్ అక్కడి నుంచి పరారైనాడు, హడలిపోయిన ఆఫీసు సిబ్బంది యువతి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.

 7 ఏళ్ల నుంచి వెంటపడుతున్నాడు

7 ఏళ్ల నుంచి వెంటపడుతున్నాడు

యువతికి తీవ్రగాయాలైనాయని, వారం రోజుల వరకు ఆమె ఆరోగ్యం విషయంలో హామీ ఇవ్వలేమని వైద్యులు అంటున్నారని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ మీడియాకు చెప్పారు. 7 సంవత్సరాల నుంచి యువతి వెంటపడుతున్న నాగేష్ ఆమెను టార్చర్ పెట్టాడని బాధితురాలు చెప్పిందని పోలీసులు అన్నారు, నాగేష్ ను ఆ యువతి అన్న అని పిలిచేదని పోలీసులు అన్నారు. ఐటీ హబ్ లో మరోసారి యువతి మీద యాసిడ్ దాడి జరగడంతో ప్రజలు హడలిపోయారు.

English summary
Love: Gilted lover attacks girl with acid for refusing his proposal in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X