• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Love marriage: మామ మాస్టర్ ప్లాన్, నా కూతురికి అది చూపించావా ? మర్మాంగం కట్, కుక్కచావు రా!

|

బెంగళూరు/ చెన్నై/ హోసూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి కులాలు, ఆస్తులు, అంతస్తులు అడ్డుకావడంతో ఆరు నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కాపురం పెట్టిన నవదంపతులకు లాక్ డౌన్ కష్టాలు ఎదురైనాయి. ఈ కష్టాలు మీకెందుకు, మన ఊరికి వచ్చేయండి, నాతో పాటు హ్యాపీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందువు అంటూ అమ్మాయి తండ్రి నమ్మించాడు. తీరా వెళ్లిన ప్రేమికుడిని పట్టుకున్న మామ, అతని కుటుంబ సభ్యులు నా కూతురికి ఏం చూపించి పెళ్లి చేసుకున్నావో అదే లేకుండా చేస్తాను రా అంటూ అల్లుడి మర్మంగంపై దాడి చేసి దారుణంగా చంపేశారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

ప్రాణానికి ప్రాణం

ప్రాణానికి ప్రాణం

తమిళనాడులోని ధర్మపురి జిల్లా పంచపల్లిలో నివాసం ఉంటున్న విజయ్ అలియాస్ విజి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి ప్రేమించుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న విజయ్, రాజేశ్వరి పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా కలిసి జీవించాలని మూడు సంవత్సరాలు ఎన్నోకలలు కన్నారు.

 ఆస్తులు అంతస్తుల్లో తేడా

ఆస్తులు అంతస్తుల్లో తేడా

విజయ్, రాజేశ్వరి కులాలు వేరుకావడంతో పాటు వారి ఆస్తులు, అంతస్తుల్లో చాలా వ్యత్యాసం ఉంది. విజయ్, రాజేశ్వరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిసిపోయింది. ఇంకోసారి మా అమ్మాయితో కలిసితిరిగినా, మాట్లాడినా నీ అంతు చూస్తాం అంటూ రాజేశ్వరి కుటుంబ సభ్యులు ప్రేమికుడు విజయ్ కు రెండుమూడు సార్లు వార్నింగ్ ఇచ్చారు.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

కుటుంబ సభ్యులను ఎదిరించిన రాజేశ్వరి ఆరు నెలల క్రితం విజయ్ ను పెళ్లి చేసుకుంది. సొంతఊర్లో ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయనే భయంతో విజయ్, రాజేశ్వరి బెంగళూరు చేరుకుని సొంతంగా కూరగాయల మార్కెట్ ప్రారంభించారు. పెళ్లి జరిగిన రెండు నెలలు కూరగాయల వ్యాపారం చేసిన విజయ్ భార్యను సంతోషంగానే చూసుకున్నాడు.

లాక్ డౌన్ కష్టాలతో మామ ఎంట్రీ

లాక్ డౌన్ కష్టాలతో మామ ఎంట్రీ

కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో విజయ్ కూరగాయల వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది. సొంత ఊరికి వెళ్లలేక, ఫ్రెండ్స్ ఇచ్చిన, రెండు నెలలు సంపాధించిన డబ్బులు ఖాళీ కావడంతో నవ దంపతులు విజయ్, రాజేశ్వరి మూడు నెలల కష్టాలు పడ్డారు. అదే సమయంలో రాజేశ్వరి తండ్రి మునిరాజ్ బెంగళూరు చేరుకుని కుమార్తె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మామ రియల్ ఎస్టేట్ మాస్టర్ ప్లాన్

మామ రియల్ ఎస్టేట్ మాస్టర్ ప్లాన్

మీరు ఎంతకాలం ఇక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటారని, తాము అన్ని మరచిపోయామని, మీరు మా వెంట వస్తే బాగా చూసుకుంటామని మునిరాజ్ కుమార్తె రాజేశ్వరిని నమ్మించాడు. తనతో పాటు ధర్మపురి, హోసూరు (బెంగళూరు సరిహద్దు)లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని, నీకు నేను ఆర్థిక సహాయం చేస్తానని మునిరాజ్ అల్లుడు విజయ్ కు మాయమాటలు చెప్పి నమ్మించాడు.

నా కూతురికి ఇదే చూపించావా ?

నా కూతురికి ఇదే చూపించావా ?

మామ మునిరాజ్ మాయమాటలు నమ్మిన విజయ్ నాలుగు రోజుల క్రితం ధర్మపురి వెళ్లి మొదట అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. తరువాత అక్కడి నుంచి విజయ్ నేరుగా బెంగళూరు వెళ్లకుండా మామ మునిరాజ్ దగ్గరకు వెళ్లాడు. అదేరోజు రాత్రి విజయ్ ను నమ్మించి తీసుకెళ్లారు. తరువాత రాజేశ్వరి తండ్రి మునిరాజ్, అతని కొడుకు, బంధువులు కుమ్మనూర్ సమీపంలో విజయ్ అని అర్దనగ్నంగా చేసి చితకబాదేశారు. నా కూతురికి ఇది చూపించే మమ్మల్ని ఆమెకు దూరం చేస్తావారా అంటూ విజయ్ మర్మంగంపై దాడి చేశారు. మర్మంగంపై తీవ్రగాయాలు కావడంతో విజయ్ మరణించాడు. విజయ్ మృతదేహాన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన దూరంగా విసిరేసి వెళ్లిపోయారు. అర్దనగ్నంగా ఉన్న విజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పంచపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

అమృత, మారుతిరావ్ స్టోరీ రిపీట్

అమృత, మారుతిరావ్ స్టోరీ రిపీట్

పోలీసులు విజయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విజయ్ ని అతని మామ మునిరాజ్, అతని కుటుంబ సభ్యులు హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అప్పటికే తప్పించుకున్న మునిరాజ్ కుటుంబ సభ్యులు కర్ణాటక- తమిళనాడులో సరిహద్దులోని బంధువుల ఇల్లో తలదాచుకోవడంతో ఆరు మందిని పట్టుకున్నారు. తెలంగాణలో తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందని మారుతిరావ్ అల్లుడిని ఎలా దారుణంగా హత్య చేయించాడో అదే స్టైల్లో మునిరాజ్ అతని అల్లుడిని చంపేశాడు. విజయ్ కుటుంబ సభ్యులు, ప్రియురాలు రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పంచపల్లి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

English summary
Love marriage: Young married man found dead in Dharmapuri in Tamil Nadu, 6 arrested near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X