Unmarried: లవర్స్ ఎంజాయ్, ప్రియురాలి బిడ్డను అమ్మేసిన ప్రియుడు, గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1 లక్ష వాటా !

చెన్నై/ఈరోడ్: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. వివాహం చేసుకోకుండానే యువతి, యువకుడు సహజీవనం చేశారు. ప్రియుడితో కలిసి విహారయాత్రలకు వెళ్లిన ప్రియురాలు అతనితో శారీరక సంబందం పెట్టుకుంది. ప్రేమికులు పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడంతో ప్రియురాలు గర్బవతి అయ్యింది. తాను గర్బవతి అయ్యానని ప్రియురాలు ఆలస్యంగా గుర్తించింది. అయితే అప్పటికే అబార్షన్ చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులుకు, బంధువులు, స్నేహితులకు తెలీకుండా ప్రియురాలు సీక్రేట్ గా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రియురాలికి పుట్టిన బిడ్డను ఆమె ప్రియుడు కొన్ని లక్షల రూపాయలకు అమ్మేశాడు. బిడ్డను విక్రయించిన తరువాత ప్రియుడు అతని ప్రియురాలికి రూ. 1 లక్ష గిఫ్ట్ గా ఇచ్చాడు.

 పెళ్లి కాకుండానే సహజీవనం

పెళ్లి కాకుండానే సహజీవనం

చెన్నై సిటీలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన ఓ యువకుడికి ఓ యువతి పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న యువతి, యువకుడు ప్రేమలోపడ్డారు. అయితే ప్రియుడిది నిజమైన ప్రేమకాదని ఆమె గుర్తించలేకపోయింది. వివాహం చేసుకోకుండానే యువతి, యువకుడు సహజీవనం చేశారు.

 ప్రియుడి మోజులో పడి తల్లి అయ్యింది

ప్రియుడి మోజులో పడి తల్లి అయ్యింది


ప్రియుడితో కలిసి విహారయాత్రలకు వెళ్లిన ప్రియురాలు అతనితో శారీరక సంబందం పెట్టుకుంది. కొంతకాలం పాటు ప్రియురాలు గర్బవతి కాకుండా ఆనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రేమికులు పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడంతో ప్రియురాలు గర్బవతి అయ్యింది. తాను గర్బవతి అయ్యానని ప్రియురాలు ఆలస్యంగా గుర్తించింది.

సీక్రేట్ గా బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలు

సీక్రేట్ గా బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలు

ఏం చెయ్యాలో తెలీక ప్రియురాలు ఓ డాక్టర్ ను సంప్రధించిందని తెలిసింది. అయితే అప్పటికే అబార్షన్ చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులుకు, బంధువులు, స్నేహితులకు తెలీకుండా ప్రియురాలు 2021లో సీక్రేట్ గా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను ఏం చెయ్యాలో తెలీక ఆమె ప్రియుడికి బిడ్డను అప్పగించింది.

 బిడ్డను అమ్మేసిన ప్రియుడు.... ప్రియురాలికి వాటా

బిడ్డను అమ్మేసిన ప్రియుడు.... ప్రియురాలికి వాటా

ప్రియుడు ఓ మద్యవర్తి ద్వారా ఈరోడ్ జిల్లాలో నివాసం ఉంటున్న దంపతులను సంప్రధించారు. ఈరోడ్ లో ఉండే దంపతులకు పిల్లలు లేకపోవడంతో చెన్నై ప్రియుడిని నుంచి ఆ దంపతులు 5 రోజుల క్రితం పుట్టిన బిడ్డను రూ. 2.50 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ప్రియురాలికి పుట్టిన బిడ్డను రూ. 2.50 లక్షలకు విక్రయించిన ప్రియుడు బిడ్డ సమస్య తీరిపోయిందని అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు.

 మద్యం మత్తులో మ్యాటర్ లీక్

మద్యం మత్తులో మ్యాటర్ లీక్

బిడ్డను విక్రయించగా వచ్చిన డబ్బులో కొంత మధ్యవర్తికి ఇచ్చిన ప్రియుడు అతని ప్రియురాలికి రూ. 1 లక్ష వాటా ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇంతకాలం ఈ విషయం రహస్యంగానే ఉండిపోయింది. అయితే మద్యం మత్తులో ప్రియుడు నోరుజారడం, ఆ విషయం అక్కడా ఇక్కడా తెలిసి పోలీసుల చెవిలో పడటంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

 సీన్ మొత్తం రివర్స్ అయ్యింది

సీన్ మొత్తం రివర్స్ అయ్యింది

ప్రియురాలికి పుట్టిన బిడ్డను అక్రమంగా విక్రయించిన ప్రియుడు, మధ్యవర్తి మీద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ప్రేమికులు ఇంకా ఇలా బిడ్డలకు జన్మనిచ్చి ఎవరికైనా విక్రయించారా ? అని చెన్నై సిటీ పోలీసులు ఆరా తీస్తున్నారు. భారతదేశంలో పుట్టిన బిడ్డలను అక్రమంగా విక్రయించడం నేరం. అలాగే చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకోవాలని, అక్రమంగా కొనుక్కోకూడదని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+