Lovers: 10వ తరగతి అమ్మాయి, మతాలు వేరు, ప్రేమ, పెళ్లి అంటూ ?, అబ్బాయి ఇంట్లో ఇద్దరూ !
బెంగళూరు/హావేరి: తెలిసి తెలియని వయసులో పరిచయం అయిన ఇద్దరు మైనర్లు ప్రేమ, పెళ్లి అంటూ ప్రాణాలు తీసుకున్నారు. బాగా చదువుకుని మాకు మంచి పేరు తీసుకు వస్తారు అని ఆశపడిన కుటుంబ సభ్యుల ఆశలు అడియాసలు చేశారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి వేరే మతానికి చెందిన మైనర్ అబ్బాయి ప్రేమలో పడింది. అబ్బాయి ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న అమ్మాయి స్కూల్ మద్యలో అబ్బాయి ఇంటికి వెళ్లింది. మూడు గంటల పాటు మైనర్ ప్రేమికులు అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు. తరువాత అబ్బాయి ఇంటిలోనే ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పక్కపక్క ఏరియాలో మైనర్లు
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని బ్యాడగి పట్టణంలో కుంబార వర్గానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి బ్యాడగిలోని ఎస్ఎస్ పీఎస్ స్కూల్ లో 10వ తరగతి చదువుతోంది. బ్యాడగిలో అమ్మాయి నివాసం ఉంటున్న సమీపంలోని ఏరియాలో వేరే మతానికి చెందిన మైనర్ అబ్బాయి నివాసం ఉంటున్నాడు.

ఆడుకునే వయసులో ప్రేమ
గత సంవత్సరం అమ్మాయి, అబ్బాయికి పరిచయం అయ్యింది. ఇద్దరి మతాలు వేరు అయినా స్కూల్ కు వెళ్లి వచ్చే సమయంలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటున్న విషయం స్థానికులు గమనించినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. తరువాత 10వ తరగతి చదువుతున్న అమ్మాయి వేరే మతానికి చెందిన మైనర్ అబ్బాయి ప్రేమలో పడింది.

పెళ్లికి అంగీకరించరని భయం ?
ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో ఆమె మైనర్ ప్రియుడు మాట్లాడుతున్నారు. మన మతాలు వేరని, మన పెళ్లికి పెద్దలు అంగీకరించని మైనర్ ప్రేమికులు అతిగా ఆలోచించారని తెలిసింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాలని మైనర్ ప్రేమికులు మాట్లాడుకున్నారని తెలిసింది.

ప్రియుడి ఇంట్లో ప్రేమికుల ఆత్మహత్య
బుధవారం అమ్మాయి స్కూల్ కు వెళ్లింది. ప్రియుడి ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ఆ అమ్మాయి స్కూల్ మద్యలోనే అబ్బాయి ఇంటికి వెళ్లింది. మూడు గంటల పాటు మైనర్ ప్రేమికులు అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు. తరువాత అబ్బాయి ఇంటిలోనే ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన అబ్బాయి కుటుంబ సభ్యులు విషయం గమనించి ఆర్తనాదాలు చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు సైతం అక్కడికి చేరుకుని విలపించారు. మైనర్ ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం హావేరి జిల్లాలో కలకలం రేపింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications