Lovers: బర్త్ డే రోజు ప్రియురాలిని చంపేసిన శాడిస్టు ప్రియుడు. అర్దరాత్రి ఫోన్ వచ్చిందని ? !
బెంగళూరు/నేపాల్: యువతి ఉద్యోగం చెయ్యాలని ఆశపడింది. కుటుంబ సభ్యులను ఒప్పించి యువతి దేశం విడిచిపెట్టి వేరే దేశం వచ్చింది. ఉద్యోం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్న యువతికి ఆమె దేశానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను ఇద్దరూ దగ్గర అయ్యారు. పెళ్లి చేసుకుందామని యువతి చెప్పింది. పెళ్లికాకుండానే ప్రియురాలితో సహవజీవనం చేస్తున్న ప్రియుడు అతని కోరికలు తీర్చుకున్నాడు. ప్రియుడు నన్ను సుఖపెడుతాడని ప్రియురాలు అనుకుంది. అయితే ప్రియురాలి బర్త్ డే రోజు ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురికావడంతో అందరూ హడలిపోయారు. అర్దరాత్రి యువతికి ఆమె ఫ్రెండ్ ఫోన్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాడు.

నేపాల్ టూ బెంగళూరు
నేపాల్ కు చెందిన క్రిష్ణకుమారి (23) అనే యువతి మంచి ఉద్యోగం చెయ్యాలని బెంగళూరు వచ్చింది. బెంగళూరు చేరుకున్న క్రిష్ణకుమారి రామమూర్తి సమీపంలోని టీసీ పాళ్యలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నది. బెంగళూరులోనే క్రిష్ణకుమారి ఓ ఫేమస్ స్పా సెంటర్ లో ఉద్యోగంలో చేరింది.

పార్ట్ టైమ్ జాబ్
స్సాలో ఉద్యోగం చేస్తున్న క్రిష్ణకుమారి పార్ట్ టైమ్ గా బ్యూటీషియన్ గా పని చేస్తోంది. కొంతకాలం తరువాత నేపాల్ కు చెందిన సంతోష్ దామి అనే యువకుడు క్రిష్ణకుమారికి పరిచయం అయ్యాడు. నేపాల్ దేశానికే చెందిన క్రిష్ణకుమారి, సంతోష్ దామి దగ్గర అయ్యారు, రానురాను సంతోష్ దామి, క్రిష్ణకుమారి చనువు పెంచుకున్నారు.

సహజీవనం చేస్తున్న లవర్స్
కొంతకాలం తరువాత క్రిష్ణకుమారి, సంతోష దామి శారీరకంగా దగ్గర అయ్యారు. పెళ్లి చేసుకుందామని క్రిష్ణకుమారి ఆమె ప్రియుడు సంతోష్ కు చెప్పింది. మంచి చాన్స్ చిక్కిందని అనుకున్న సంతోష్ దామి టీసీపాళ్యలోని ప్రియురాలు క్రిష్ణకుమారి ఇంటిలోనే మకాం పెట్టేశాడు. పెళ్లికాకుండానే ప్రియురాలు క్రిష్ణకుమారితో సంతోష్ దామి సహవజీవనం చేసి అతని కోరికలు తీర్చుకున్నాడు.

బర్త్ డే రోజు ప్రియురాలిని చంపేశాడు
డిసెంబర్ 6వ తేదీన క్రిష్ణకుమారి బర్త్ డే. మంగళవారం రాత్రి టీసీపాళ్యలో ఫ్రెండ్స్ కు క్రిష్ణకుమారి, సంతోష్ దామి బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఆ సందర్బంలో క్రిష్ణకుమారి స్నేహితుడు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. రాత్రి నీకు ఎందుకు వాడు ఫోన్ చేశాడు అని గొడవ పెట్టుకున్న సంతోష్ దామి ఆమెకు నరకం చూపించాడు. పుట్టిన రోజే క్రిష్ణకుమారిని ఆమె ప్రియుడు సంతోష్ హత్య చేశాడు. ప్రియురాలిని చంపేసిన సంతోష్ ను రామమూర్తి నగర పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications