చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెరిగన వంట గ్యాస్ ధరలు: మీ ప్రాంతంలో సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరను తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కేంద్రం మరోసారి బాంబు పేల్చింది. వంటగ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. పెరిగిన ధరలు బుధవారం మే 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ సబ్సీడీ ధర 28 పైసలు పెరుగగా అదే ముంబైలో 29 పైసలు పెరిగింది. ఇక సబ్సడీయేతర సిలిండర్ ధర రెండు నగరాల్లో అంటే ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.6 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ద్వారా తెలుస్తోంది.

మే 1 నుంచి 14.2 కిలోల సబ్సడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో ఇలా ఉన్నాయి.

LPG cylinder price hiked with immediate effect

ఢిల్లీ: రూ.712.50

కోల్‌కతా : రూ. 738.50

ముంబై : రూ.684.50

చెన్నై : రూ.728.00

ఇక మే 1 నుంచి 14.2 కిలోల సబ్సడీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో ఇలా ఉన్నాయి.

ఢిల్లీ : రూ.496.14

కోల్‌కతా : రూ.499.29

ముంబై: రూ. 493.86

చెన్నై : రూ. 484.02

గతేడాదికి ఈ ఏడాదికి ధరల్లో మార్పును ఒకసారి గమనిస్తే... సబ్సీడీయేతర వంటగ్యాస్ ధర గతేడాది రూ.96 ఉండగా ప్రస్తుతం అది రూ. 98.5కు చేరుకుంది. సబ్సీడీ వంట గ్యాస్ ధర గతేడాది రూ.4.71 ఉండగా ఈ ఏడాది అది రూ.4.83కి చేరుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఒక ఇంటికి 12 సిలిండర్లకు సబ్సడీ ఇస్తోంది. సబ్సీడీ ధర నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేస్తోంది. ఇక సబ్సీడీ సిలిండర్ కాకుండా ఇంకా ఎక్కువ గ్యాస్ సిలిండర్‌లు అవసరమైతే వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే సబ్సడీ ధరలు ప్రతినెల మారుతూ ఉంటాయి.

English summary
The prices of LPG or liquefied petroleum gas were hiked on Wednesday with immediate effect. The prices of LPG cylinder with subsidy has been increased by Rs 0.28 in Delhi and Rs 0.29 in Mumbai while the price of LPG cylinder without subsidy has been increased by Rs 6 in both Delhi and Mumbai, according to data from Indian Oil Corporation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X