LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ?
ఇరాన్ వార్ నేపథ్యంలో దేశంలో నానాటికీ పెరుగుతున్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మారుస్తోంది. ఇప్పటికే అసాధారణంగా పెరుగుతున్న ఎల్పీజీ కృత్రిమ కొరతకు అడ్డుకట్ట వేసేందుకు గ్యాస్ బుకింగ్స్, డెలివరీ సహా పలు అంశాల్లో మార్పులు చేస్తున్న కేంద్రం.. ఇప్పుడు గ్యాస్ సిలెండర్లలో నింపే గ్యాస్ విషయంలోనూ కీలక మార్పుకు సిద్దమవుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
దేశంలో ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కేజీల ఎల్పీజీ సిలెండర్ (LPG Cylinder)ను చమురు సంస్థలు పంపిణీ చేస్తున్నాయి. అయితే ఈ సిలెండర్లను బ్లాక్ మార్కెటీర్లు భారీగా బ్లాక్ చేస్తుండటంతో తిరిగి వాటిని నింపి ప్రజలకు అందించడంలో ఇబ్బందులు తప్పడం లేదు. అలా కాకుండా 14.2 కేజీలకు బదులు అదే సిలెండర్ లో 10 కేజీలే గ్యాస్ నింపి ఇస్తే.. అది పూర్తి కాగానే తిరిగి రీఫిల్లింగ్ కోసం దాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. అప్పుడు సిలెండర్ల లభ్యత పెరుగుతుందని చమురు సంస్థలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి సైతం ప్రతిపాదించాయి.

అయితే ఈ విషయంపై స్పందించని కేంద్రం.. సోషల్ మీడియాలో 10 కేజీల గ్యాస్ సిలెండర్లు తెస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం నిన్న ఖండించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శి సుజాతా శర్మ దీనిపై స్పందిస్తూ అదంతా ఒట్టి ప్రచారమే అని తేల్చేశారు. అయితే కేంద్రం వద్దకు ఆయిల్ కంపెనీలు పంపిన ప్రతిపాదనపై ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతానికి దీన్ని ప్రచారంగా కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వార్ కొనసాగి గ్యాస్ సిలెండర్ల కొరత మరింత తీవ్రమైతే చివరికి ఇదే ఆప్షన్ కాబోతోందని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. దీంతో 10 కేజీల గ్యాస్ సిలెండర్ ప్రచారంపై క్లారిటీ వచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications