గ్యాస్‌ ధర, ఐటీ రిటర్న్స్‌, బంగారం హాల్‌మార్కింగ్‌- ఇవాళ్టి నుంచి మార్పులివే

కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి కొన్ని కీలక పథకాలు, విధానాల్లో మార్పులు తీసుకొస్తోంది. వీటితో సాధారణ ప్రజలపై ప్రభావం పడబోతోంది. ఇందులో గ్యాస్‌ ధర, బంగారం హాల్‌ మార్కింగ్‌, చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ, ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ వంటి అంశాలు ఉన్నాయి. వీటిలో జరుగుతున్న మార్పులు సామాన్యుల జీవితాలపై కచ్చితంగా ప్రభావం చూపబోతున్నాయి. దీంతో ఆయా అంశాలపై ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలివే.

 కొత్త పీఎఫ్‌ నిబంధనలు

కొత్త పీఎఫ్‌ నిబంధనలు

ఉద్యోగుల పీఎఫ్‌ నిబంధనల్లో కేంద్రం ఓ కీలక మార్పు చేసింది. వీటి ప్రకారం ఇకపై ప్రతీ సంస్ధా తమ వద్ద పనిచేసే ప్రతీ ఉద్యోగి ఆధార్ నంబర్‌ను వారి పీఎఫ్ ఖాతాకు జత చేయాలి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని రిటైర్మెంట్ లేదా సంస్ధ మారినప్పుడు పొందే వీలుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా సంస్ధలు ఉద్యోగుల ఆధార్‌ను అనుసంధానం చేయకుండానే ఉద్యోగుల్ని పనిచేయిస్తున్నారు.

 మళ్లీ గ్యాస్‌ ధరల మంట

మళ్లీ గ్యాస్‌ ధరల మంట

అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ చమురు సంస్ధలు ప్రతీ నెలా ధరల్ని సవరిస్తున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఇందులో భాగంగానే గ్యాస్‌ ధరపైనా బాదుడుకు సిద్దమయ్యాయి. ఈ నెలలో గ్యాస్‌ ధర 50 నుంచి 100 రూపాయల మేర పెరిగే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనావేస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న సామాన్యులపై మరింత భారం పడినట్లే.

 విమాన టికెట్ల ధరలకు రెక్కలు

విమాన టికెట్ల ధరలకు రెక్కలు

ఈ నెల నుంచి విమాన ప్రయాణాలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా అంతంతమాత్రంగా తిరుగుతూ నష్టాలు మూటగట్టుకుంటున్న విమానయాన సంస్ధలు ఇప్పుడు టికెట్‌ ధరల పెంపుతో వాటిని భర్తీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశాయి. విమాన టికెట్ల ధరలను కనీసం 16 శాతం పెంచుకునేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది. దీంతో ఆయా సంస్ధలు ఇవాళ్టి నుంచి 13 నుంచి 16 శాతం ధరల్ని పెంచేశాయి.

 పొదుపుపై తగ్గనున్న వడ్డీ

పొదుపుపై తగ్గనున్న వడ్డీ

దేశవ్యాప్తంగా చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీల భారాన్ని మరింత తగ్గించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్చిలో పీపీఎఫ్‌, జాతీయ పొదుపు సర్ఠిఫికెట్లు, సుకన్యా సమృద్ది యోజన వంటి పథకాలపై వడ్డీల్ని తగ్గించిన కేంద్రం.. అప్పుడే చిన్న మొత్తాల పొదుపుపైనా వడ్డీ మొత్తం తగ్గించింది. అయితే పొరబాటున చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ తగ్గించినట్లు చెప్పిన కేంద్రం దాన్ని ఉపసంహరించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు వీటిపై వడ్డీల్ని తగ్గించేందుకు రెడీ అవుతోంది.

 బంగారం హాల్‌మార్కింగ్‌ మార్పులివే

బంగారం హాల్‌మార్కింగ్‌ మార్పులివే

బంగారానికి హాల్‌మార్కింగ్‌ చేసే కొత్త విధానాన్ని ఈ నెలలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా జూన్‌ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించినా బంగారం వ్యాపారుల డిమాండ్లతో దీన్ని జూన్‌ 15కు మార్చారు. ఇకపై వినియోగదారులు కొనుగోలు చేసే అన్ని అభరణాలకూ హాల్‌మార్క్ తప్పనిసరి. ఈ నిర్ణయం వినియోగదారుల ప్రయోజనాల కోసమేనని కేంద్రం చెప్తున్నా ఈ భారం కూడా వినియోగదారులపైనే పడనుంది.

 ఐటీ రిటర్న్స్‌కు కొత్త వెబ్‌సైట్‌

ఐటీ రిటర్న్స్‌కు కొత్త వెబ్‌సైట్‌

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న వెబ్‌సైట్‌ స్ధానంలో మరో కొత్త వెబ్‌సైట్‌ను మరిన్ని సౌకర్యాలతో కేంద్రం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రస్తుతం వినియోగిస్తున్న ఇన్‌కమ్‌ట్యాక్స్‌ఇండియాఈఫైలింగ్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ జూన్‌ 1 నుంచి 6వ తేదీ వరకూ పనిచేయదని కేంద్రం తెలిపింది. జూన్‌ 7వ తేదీన కేంద్రం ఇన్‌కమ్‌ట్యాక్స్‌జీవోవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించబోతోంది. పాత వెబ్‌సైట్‌తో పోలిస్తే ఇది మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుందని కేంద్రం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+