LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..!

దేశవ్యాప్తంగా ఇరాన్ వార్ ప్రభావంతో చమురు, గ్యాస్ కొరత కనిపిస్తోంది. గృహావసరాలతో పాటు వాణిజ్య వినియోగదారులు సైతం చమురు, గ్యాస్ కొరతతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్ధితిని సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ ఎల్పీజీ (LPG)పై మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని క్షేత్రస్దాయిలో ఎలా అమలు చేయాలో రాష్ట్రాలకు లేఖ రాసింది.

పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు ఇవాళ ఓ లేఖ రాశారు. ఇందులో పరిశ్రమలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 50% ఎల్పీజీ (commercial LPG) కేటాయింపునకు అదనంగా మరో 20% కూడా ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. దీనితో మొత్తం వాణిజ్య ఎల్‌పిజి కేటాయింపు, సంక్షోభానికి ముందున్న ప్యాక్డ్ నాన్-డొమెస్టిక్ ఎల్‌పిజి స్థాయిలో 70 శాతానికి చేరుతుందన్నారు.

LPG Relief for Industry MoPNG Raises Commercial Allocation to 70 of Pre-Crisis Level

అధిక శ్రమ అవసరమయ్యే, ఇతర కీలక రంగాలకు అవసరమైన ఉక్కు, ఆటోమొబైల్, వస్త్ర, రంగుల, రసాయనాలు , ప్లాస్టిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ఈ అదనపు కేటాయింపు చేయాలని రాష్ట్రాల్ని కోరారు. వీటిలో ప్రాసెస్ పరిశ్రమలకు , సహజ వాయువుతో ప్రత్యామ్నాయం లేని ప్రత్యేక తాపన ప్రయోజనాల కోసం ఎల్పీజీ అవసరమయ్యే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఈ కోటా వినియోగించుకోని రాష్టాలు 10% సంస్కరణల ఆధారిత కేటాయింపును వెంటనే వాడుకోవాలని కోరారు. దీనితో వాణిజ్య/పారిశ్రామిక ఎల్‌పిజి కేటాయింపు 70%కి (10% సంస్కరణల ఆధారిత కేటాయింపుతో)స్ధాయికి చేరుతుంది. అలాగే రాష్ట్రంలోని పారిశ్రామిక కార్యకలాపాలకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+