మా ఎన్నికలు - పవన్ కళ్యాణ్: ‘తెలుగు సినిమా పరిశ్రమ చీలిపోవడం అనే ప్రశ్నే లేదు’

తెలుగు సినిమా పరిశ్రమలోని కళాకారుల సంఘం.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్‌స్కూల్‌లో జరుగుతున్నాయి.
ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, మంచు మనోజ్, పలువురు నటీనటులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''తిప్పితిప్పికొడితే 900 మంది. దాంట్లో వ్యక్తిగత దూషణలు.. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పది మందికీ సినిమాలు చేసేవాళ్లు కొంచెం ఆదర్శంగా ఉండాలి. వ్యక్తులు చేసేది ఎప్పుడూ సినిమా రంగానికి అంటదు. వ్యక్తులు చేసేది వ్యక్తులకే అంటుతుంది.
చాలాసార్లు ఓట్లేశాను కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదు. నాకూ అర్థం కావట్లేదు ఎందుకు అని. ఇంత అవసరం ఉందా? అనిపిస్తుంది ఒక్కోసారి.
సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోతుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'అలా ఎప్పుడూ జరగదు.. నేను చెబుతున్నా మీకు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే.. సైడ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి కానీ..' అన్నారు.
మీ సపోర్ట్ ఎవరికి? అని ప్రశ్నించగా.. 'అలా ఎలా చెబుతామండీ.. చెప్పకూడదు కదా. ప్రభావితం చేసినట్లవుతుంది' అన్నారు.
నేను పెట్టిన పార్టీలో కూడా ఎంపీటీసీలు, పంచాయితీలు గెలిచాం. దాంట్లో కూడా ఉదాహరణకు అధికార పార్టీ వాళ్లు వచ్చి మాకు సహకారం ఇస్తే మేం ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అవుతాం అన్నారు. అక్కడే అంత సహకారం ఉన్నప్పుడు.. ఇక్కడ కూర్చోబెట్టి, అందరం కూర్చుని మాట్లాడుకుని, చాలా సున్నితంగా, ఏకగ్రీవంగా చేసి ఉండొచ్చు. పొలిటికల్‌గా ఏమీ టర్న్ అవదండీ’’ అని పవన్ అన్నారు.
చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కదా.. అని అడగ్గా.. ''వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అండీ’’ అంటూ పవన్ వెళ్లిపోయారు.
- ప్రకాశ్ రాజ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు
- మంచు విష్ణు: 'తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్ విషయంలో మాత్రం..’
'వర్గాలు ఏమీ లేవు’ - బాలకృష్ణ
తెలుగు సినీ పరిశ్రమలో వర్గాలు ఏమీ లేవని, అందరం కలిసి పనిచేసుకుంటామని సినీ హీరో బాలకృష్ణ అన్నారు.
''ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''ఎప్పుడూ జరిగేలాగే మా ఎన్నికలు.. ఎవరు బాగా చేస్తారు కళాకారులకు, ఇండస్ట్రీకి వారికి నేను ఓటేయడం జరిగింది. ఇద్దరూ బాగానే చేస్తారు అనిపిస్తోంది. దీంతో ఒక ప్యానల్‌కో, కొందరికో, రెండు ప్యానెళ్లలోని కొంతమందికో ఓటేయడం జరిగింది. ఏదైనా ఇండస్ట్రీకి ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివాళ్లే. మాటలు చెప్పడమే కాదు చేసి చూపించేవాళ్లు. ఏదైనా ఇండస్ట్రీలో మళ్లీ షూటింగుల్లో కలిసి పనిచేసుకునేవాళ్లమే. ఎవరెవరికి ఏ అవసరాలు ఉంటాయో వారికి అవి అందేలా చేసే బాధ్యత మా కమిటీ వాళ్ల బాధ్యతే కాదు, అందరి బాధ్యత. ఎవరు గెలిచినా కూడా వాళ్లను వెనకఉండి నడిపిస్తాం, ప్రోత్సహిస్తాం’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూపీ: 'రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications