ముదురుతున్న ఫోటో షూట్ ల పిచ్చి ... బురదలో పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్

ఫోటోగ్రఫీ పిచ్చి రోజు రోజుకీ ముదురుతోంది. ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు పేరుతో వింత పోకడలకు పోతున్నారు నేటి యువత. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, ప్రసవానికి ముందు, ఆ తర్వాత అంటూ కొంతమంది ఫొటో షూట్ ల పేరుతో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇది ఎవరికి వారికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించినదే అయినప్పటికీ ఇక్కడ కొంత చూసే వారు ఏమనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం లేకపోవటం ప్రధానంగా కనిపిస్తుంది.

ఫోటో షూట్ ల పేరుతో పెరుగుతున్న పైత్యం

ఫోటో షూట్ ల పేరుతో పెరిగిపోయిన పైత్యం విమర్శల పాలు చేస్తోంది . ఈ పిచ్చి ఎంతగా ముదిరింది అంటే కొత్తగా పెళ్లైన జంట బురద లో పడుకొని, ఆ బురదను ఒళ్లంతా పూసుకుంటూ ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వేడుకలకు సంబంధించి జ్ఞాపకాలు పదిలం చేసుకోవడానికి ఫోటోలు తీసుకోవాలి కానీ, అదొక పిచ్చిలా , చెట్లు ఎక్కి , పుట్టలెక్కి కింద పడుతూ లేస్తూ, దెబ్బలు తగిలించుకుంటూ రకరకాల ఫోజులు పెట్టి ఫోటోలు తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది.

బురదలో పొర్లుతూ పోస్ట్ వెడ్డింగ్ షూట్

బురదలో పొర్లుతూ పోస్ట్ వెడ్డింగ్ షూట్

ఫోటోగ్రఫీ వింత పోకడలకు పరాకాష్టగా తీసిన ఒక వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కేరళకు చెందిన ఓ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ జరుపుకుంది. ‘మడ్ లవ్' పేరుతో ఆ కొత్త జంట బురదలో పొర్లుతూ,ఒకరికొకరు బురదను పూసుకుంటూ వింత వింత విన్యాసాలు చేసింది. రకరకాల ఫోజులు పెట్టింది. ఓ ఫొటో స్టూడియో జరిపిన ఈ ఫొటో షూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సోషల్ మీడియా లో వైరల్ ... సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియా లో వైరల్ ... సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. బురదలో పోర్లాడటం కంటే మంచి ఆలోచన వేరేది లేదా అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక కొందరైతే తమిళ సినిమాలు ఎక్కువగా చూసి ఉంటారని,అందుకే ఇలాంటి విచిత్రమైన ఆలోచన తట్టింది అని సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా బురదలో పొర్లాడే ఈ వింత ప్రేమ ఏంటో, ఈ ఫోటో షూట్స్ ఏంటో అని తెగ చర్చించుకుంటున్నారు.

లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి మరీ ఫోటో షూట్ లు .. కల్చర్ పేరుతో కొత్త పుంతలు

లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి మరీ ఫోటో షూట్ లు .. కల్చర్ పేరుతో కొత్త పుంతలు

ఇక ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ లు సాంప్రదాయ వాదులు ఖండిస్తున్నారు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మరీ ఇలా ప్రీ వెడ్డింగ్ , పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్ పేరుతో ఇష్టారాజ్యంగా ఇబ్బందికరమైన ఫోటోలతో చేస్తున్న హడావిడి అవసరమా అంటున్నవారు లేకపోలేదు. అంతే కాదు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ , పోస్ట్ వెడ్డింగ్ షూట్ ల పేరుతో సినిమా పాటలకు డ్యాన్సులు చేయించటం కూడా ఇప్పుడు కల్చర్ గా మారిపోయింది. చిత్ర విచిత్రంగా చేస్తున్న ఈ డాన్స్ లు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+