పీకల్లోతు కష్టాల్లో హీరో విశాల్; 21కోట్ల వివాదంతో సినిమాలపై బ్యాన్ విధించిన మద్రాస్ హైకోర్టు
పందెంకోడి సినిమా హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక పాత వివాదం నేపథ్యంలో విశాల్ కు ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే విశాల్ సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కి చిత్రాలపై నిషేధం ఉంటుందని హెచ్చరించింది. ఇంతకీ విశాల్ ఎదుర్కొంటున్న వివాదం ఏమిటి? ఆయన విషయంలో కోర్టు ఆదేశాలు ఏమిటి? అంటే..
కొన్ని సంవత్సరాల క్రితం విశాల్ అన్బు చెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఫిలిం ఫ్యాక్టరీ కోసం 21 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ అప్పును కుదిరిన ఒప్పందం మేరకు లైకా అనే సంస్థ తిరిగి చెల్లించింది. ఈ సమయంలో లైకా సంస్థకు తిరిగి విశాల్ డబ్బులు చెల్లించే వరకు విశాల్ నటించిన చిత్రాల పంపిణీ హక్కులు తమకే సొంతమని వారు అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ నిబంధనను అతిక్రమించి విశాల్ తను తీసిన సామాన్యుడు చిత్రాన్ని రిలీజ్ చేసుకున్నాడు.

దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో విశాల్ 15 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విశాల్ డబ్బులు చెల్లించలేదు. ఇక ఇదే వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగిన సమయంలో తనకి ఇటీవల 18 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, అందుకే డబ్బులు చెల్లించలేకపోయానని విశాల్ పేర్కొన్నారు. అయితే హైకోర్టు విశాల్ ఆస్తుల వివరాలు అడిగి సింగిల్ జడ్జి స్పెషల్ కోర్ట్ ఆదేశించిన 15 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ను చెల్లించాలని అంతకుముందు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.
అంతేకాదు ఈ మొత్తం డబ్బులు చెల్లించే వరకు విశాల్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఫిలిం ఫ్యాక్టరీ లో తెరకెక్కుతున్న సినిమాలు థియేటర్లలో, ఓటీటీ లలోనూ రిలీజ్ కాకుండా నిషేధం విధిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. అంతేకాదు లైకా సంస్థకు మూడు వారాల గడువులోపు 15 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలని ఆదేశించింది. దీంతో విశాల్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇక దీనిపై విశాల్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications