మహాలో కూటమి చాణక్యం- హవా మామూలుగా ఉండదట
Maharashtra Assembly exit Polls 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145.
ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ మధ్య పోటీ నెలకొంది.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.
ఫాలొది సట్టా బజార్ తన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఇది. మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపింది. ఈ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని పేర్కొంది. 150 నుంచి 170 నియోజకవర్గాల్లో మహాయుటి జెండా రెపరెపలాడుతుందని సట్టా బజార్ అభిప్రాయపడింది.
మహా వికాస్ అఘాడి కూటమికి ఈ సారి కూడా పరాభవం తప్పకపోవచ్చనేది సట్టా బజార్ అంచనా. దీని ప్రకారం చూసుకుంటే ఈ ధఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందీ కూటమి. వికాస్ అఘాడీకి 110 నుంచి 130 వరకు సీట్లు దక్కొచ్చని పేర్కొంది. ఇతరులు 8 నుంచి చోట్ల విజయం సాధిస్తారని తెలిపింది.
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూడా ఇలాంటి అంచనాలనే వెలువడించింది. మహాయుటి వైపే మొగ్గు చూపింది. ఈ కూటమి హవా వీస్తుందని అంచనా వేసింది. 152 నుంచి 160 నియోజకవర్గాల్లో జెండా పాతుతుందని పేర్కొంది. ఇందులో కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది.
మహా వికాస్ అఘాడి కూటమికి ఈ సారి కూడా పరాభవం తప్పకపోవచ్చని చాణక్య పేర్కొంది. ఈ ధఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందీ కూటమి. వికాస్ అఘాడీకి 130 నుంచి 138 వరకు మాత్రమే సీట్లు దక్కొచ్చని పేర్కొంది, అధికారాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కు అతి సమీపంలో ఆగిపోతుందని తెలిపింది. ఇతరులు 6 నుంచి 8 చోట్ల విజయం సాధిస్తారని తెలిపింది.












Click it and Unblock the Notifications