కేంద్ర మంత్రి నారాయణ రాణెను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు, ఇంతకీ ఏం జరిగింది

నారాయణ రాణె

కేంద్ర మంత్రి నారాయణ రాణెను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టాలని అన్నారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు.

రాణె వ్యాఖ్యల తరువాత ముంబయిలో బీజేపీ, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

ముంబయిలో నారాయణ రాణె నివాసం ఎదుట కూడా శివసేన కార్యకర్తలు ఆందోళన చేశారు.

https://twitter.com/PTI_News/status/1430110349622054915

ఇంతకీ ఏమిటీ వివాదం

వారం రోజుల కిందట భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రె జెండా ఎగరవేసిన సందర్భంగా ప్రసంగించారు.

అయితే, ఆ ప్రసంగ సమయంలో ఆయన స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని తన వెంట ఉన్న సహాయకుడిని అడిగారని, ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియని ఠాక్రెను చెంప దెబ్బకొట్టాలని నారాయణ రాణె అన్నారు.

సోమవారం ఓ సభలో మాట్లాడిన రాణె... ''ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియదు. నేనే కనుక అక్కడుంటే చెంప పగులగొట్టేవాడిని'' అన్నారు.

రాణె వ్యాఖ్యలపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని నారాయణ రాణె అంటున్నారు.

''స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. తన ప్రసంగ సమయంలో ఆయన తన వెనుకనున్నవారిని అడిగారు'' అన్నారు రాణె.

బీజేపీకి చెందిన నారాయణ రాణె అరెస్టుతో మహారాష్ట్రలోని పాలక శివసేన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

రాష్ట్రంలో ఉద్రిక్తతలు రగల్చడానికే కేంద్ర మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేశారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

అయితే, కేంద్ర మంత్రి అయిన రాణెను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని బీజేపీ నాయకులు అంటున్నారు.

నారాయణ రాణె

రాణె కూడా ఒకప్పుడు శివసేన నాయకుడే

ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా ఉన్న నారాయణ రాణె 2005 వరకు శివసేనలోనే ఉండేవారు.

2005లో శివసేనను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన అనంతర కాలంలో బీజేపీలో చేరారు.

మరోవైపు 2019 వరకు శివసేన కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోనే ఉండేది.

గత మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ కలిసి పోటీచేసిన ఈ రెండు పార్టీలు ఆ ఎన్నికల తరువాత విడిపోయాయి.

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రెను సీఎం చేయడానికి బీజేపీ అంగీకరించకపోవడంతో ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+