Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసలే ఫైర్ బ్రాండ్ ఎంపీ- పోయి పోయి ఆమెతో పెట్టుకుంటే ఎట్టారా అయ్యా

తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాకు కోపం వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై తనకు వ్యతిరేకంగా ప్రచారం, వ్యక్తిత్వ హననం చేసేలా, కించపరిచేలా పోస్టులు పెడుతున్న యూజర్లపై ఒంటి కాలిపై లేచారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పురినీ ఆమె హెచ్చరించారు. మహిళను కించపరిచేలా పోస్టులు పెడుతున్న మీ వాళ్లను జాగ్రత్తగా ఉండమని సూచించాలని చెప్పారు.

తన వ్యక్తిత్వ హననం చేస్తూ ఎక్స్ పోస్టులు పెట్టిన కొన్ని స్క్రీన్ షాట్లను మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. అలాగే- హర్దీప్ సింగ్ పురీ, పశ్చిమ బెంగాల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కు ట్యాగ్ చేశారు. ఫేక్ లైంగిక కంటెంట్‌ను వ్యాప్తి చేస్తోన్న యూజర్లందరూ కూడా హర్దీప్ సింగ్ పురీకి సంబందించిన వాళ్లని మహువా మొయిత్రా ఆరోపించారు. అలాంటి వారందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అన్నారు.

Mahua Moitra FIRs Filed Against Several Handles Reposters of Fake News Will Face Criminal Proceedings

చట్టపరంగా వారందరూ కూడా అత్యంత కఠినమైన క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటారని ఆమె స్పష్టం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే స్వార్థపరులు దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మొయిత్రా విమర్శించారు. ఇప్పటికే కొన్ని ఎక్స్ హ్యాండిల్స్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. కల్పిత వార్తలు రీపోస్ట్ చేసినా లేదా వ్యాప్తి చేసిన ఎటువంటి వారికైనా క్రిమినల్ చర్యలు తప్పవని అన్నారు.

ఒక 'పెయిడ్ ఐటీ సెల్ ట్రోల్'పై అదనంగా మరో ఎఫ్‌ఐఆర్ దాఖలైందని, దానిని వ్యాఖ్యానించేవారు లేదా రీపోస్ట్ చేసేవారికీ ఇదే వర్తిస్తుందని మొయిత్రా స్పష్టం చేశారు. కల్పిత వార్తలపై రిప్లై ఇచ్చే వాళ్లను కూడా వదలబోనని మహువా మొయిత్రా అన్నారు. అవకాశవాద గూండాలు, లైంగిక నేరగాళ్లతో కలవడం దేశానికి గర్వకారణం కాదని ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ డీజీపీని సైతం ట్యాగ్ చేస్తూ మొయిత్రా స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+