ఆ మేజర్ సీనియారిటీ తగ్గించిన ఆర్మీ
ఢిల్లీ : కాశ్మీరీ యువతితో సన్నిహితంగా మెలగడం, శ్రీనగర్‌లో హోటల్ సిబ్బందితో గొడవపడి పోలీసులకు చిక్కిన మేజర్ లీతుల్ గొగోయ్‌పై ఆర్మీ కఠిన చర్యలు తీసుకుంది. అతని సీనియారిటీని ఆరు నెలలు తగ్గించాలని నిర్ణయించింది. పెన్షన్ విషయంలో లీతుల్ గొగోయ్ సీనియారిటీని ఆరు నెలలు తగ్గిస్తూ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు కాశ్మీర్ వెలుపల పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.

గతేడాది పోలీసులకు పట్టుబడ్డ లీతుల్
గత సంవత్సరం మే 23న లీతుల్ గొగోయ్ స్థానిక యువతితో కలిసి శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. ఆన్‌లైన్‌లో రూం బుక్ చేసినా యువతి స్థానికురాలు కావడంతో సిబ్బంది గది కేటాయించేందుకు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మేజర్ లీతుల్ అక్కడ రచ్చ చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో మేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ ఆయనకు కోర్టు మార్షల్ విధించింది.

మార్చిలో ముగిసిన కోర్ట్ మార్షల్
ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించి స్థానిక యువతితో సన్నిహితంగా మెలగడం, విధి నిర్వాహణను పక్కనబెట్టి అనుమతి లేకుండా మరో ప్రాంతానికి వెళ్లడంపై లీతుల్ గొగోయ్‌పై సైన్యం విచారణ జరిపింది. బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ లీతుల్ తప్పు చేసినట్లు తేల్చింది. మార్చిలో కోర్ట్ మార్షల్ పూర్తికాగా.. తాజాగా ఆయన సీనియారిటీని తగ్గిస్తూ నిర్ణయం వెలువరించింది. సీనియారిటీ తగ్గించినందున ఇకపై లీతుల్ గొగోయ్ తన బ్యాచ్ అధికారులతో సమానంగా ప్రమోషన్లు పొందే అవకాశంలేకుండా పోయింది.

కాశ్మీరీ పౌరున్ని జీపుకు కట్టి
లీతుల్ గొగోయ్ వ్యవహారశైలి వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జమ్ము కాశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో రాళ్ల దాడి నుంచి రక్షించుకునేందుకు ఫరూక్ అహ్మద్ అనే వ్యక్తిని జీవుకు కట్టి మీడియా హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అయితే ఆర్మీ మాత్రం ఆయన చర్యను ప్రశంసించింది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్స్ కమెండేషన్ కార్డుతో సత్కరించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications