బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కత్తితో.. సీసీటీవీ ఫుటేజీలో..!!
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KAI)లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో స్వైరవిహారం చేయడానికి ప్రయత్నించాడు. ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సకాలంలో అతన్ని పట్టుకోగలిగారు. ఈ ఘాతుకాన్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బెంగళూరు పోలీసులు తాజాగా విడుదల చేశారు.
సోమవారం అర్ధరాత్రి 11:59 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు క్యాబ్ డ్రైవర్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వ్యక్తిని క్యాబ్ డ్రైవర్లు ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తోండగా.. హఠాత్తుగా కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన క్యాబ్ డ్రైవర్లు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. గట్టిగా కేకలు వేశారు.

దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి తప్పించుకుని పారిపోవడం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయింది. ఈ క్రమంలో ఓ చోట కిందపడటం, పైకి లేచి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. వారిని సీఐసీఎఫ్ సిబ్బంది వెంటాడి మరీ పట్టుకున్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్, తన సహచరులు ఇద్దరి సహాయంతో దాడికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, అతని వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అతన్ని సొహైల్ అహ్మద్ గా గుర్తించారు. అతను కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించిన టాక్సీ డ్రైవర్లు జగదీష్, రేణు కుమార్ కు ముందుగానే పరిచయం ఉందని చెబుతున్నారు. అంతకుముందు జగదీష్, రేణు కుమార్, మరో టాక్సీ డ్రైవర్ గంగాధర్ అంగడి తనపై దాడి చేశారని సొహైల్ అహ్మద్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. దానికి ప్రతీకారంగానే ఈ దాడికి దిగాడని తెలుస్తోంది.
సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడితో పాటు ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను తదుపరి చర్యల నిమిత్తం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది, విమానాశ్రయ భద్రతపై చర్చకు దారితీసింది. ఈ ఘటనతో ప్రయాణికలు బెంబేలెత్తిపోయారు.
-
రాజీనామాకు సిద్ధమైన సీఎం!, కానీ కండిషన్స్ ఇవే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications