నటి లైంగిక దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన మలయాళం హీరో దిలీప్ మేనేజర్ !
నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు జామీను ఇవ్వాలని,
కొచ్చి: నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు జామీను ఇవ్వాలని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పుణ్ణి బుధవారం కేరళ హైకోర్టులో అర్జీ సమర్పించాడు
హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆయన మేనేజర్ అప్పుణ్ణి తనను కూడా అరెస్టు చేస్తారని భయంతో మాయం అయ్యాడు. అతని కోసం కేరళ పోలీసులు ఇప్పటి వరకూ గాలిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా అప్పుణ్ణి తప్పించుకుని తిరుగుతున్నాడు.

నటి కిడ్నాప్, లైంగిక దాడికి సంబంధించి పల్సర్ సునీకి హీరో దిలీప్ ఎంత డబ్బు ఇచ్చాడు అని పూర్తి వివరాలు తెలియాలంటే ఆయన మేనేజర్ అప్పుణ్ణిని విచారణ చెయ్యాలని కేరళ పోలీసులు భావించారు. ఈ విషయం తెలుసుకున్న అప్పుణ్ణి మాయం అయ్యాడు.
తన మేనేజర్ అప్పుణ్ణికి తెలీకుండా హీరో దిలీప్ ఎలాంటి నగదు లావాదేవీలు నిర్వహించడని కేరళ పోలీసులు వివరాలు సేకరించారు. దిలీప్ మేనేజర్ అప్పుణ్ణిని విచారించాలని పోలీసులు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న అప్పుణ్ణి తన న్యాయవాదితో హైకోర్టును ఆశ్రయించాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications