నటిపై లైంగిక దాడి: లొంగిన నిందితుడు, హైడ్రామా.. అతని వెనుక హీరో?

ప్రముఖ మలయాళం నటికి లైంగిక వేధింపుల కేసులో నిందితుడు పల్సర్ సునీల్ గురువారం నాడు కోర్టు ఎదుట లొంగిపోయాడు. నిందితుడి వెనుక ఓ మలయాళ హీరో ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తిరువనంతపురం: ప్రముఖ మలయాళం నటికి లైంగిక వేధింపుల కేసులో నిందితుడు పల్సర్ సునీల్ గురువారం నాడు కోర్టు ఎదుట లొంగిపోయాడు. నిందితుడి వెనుక ఓ మలయాళ హీరో ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పల్సర్ సునీల్ లొంగిపోయారని ఓ వాదన, పోలీసులు పట్టుకున్నారని మరో వాదన వినిపిస్తోంది. మొత్తానికి అతను కోర్టులో లొంగిపోయారు. పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించారు.

తన అనుచరుడు విజేష్‌తో కలిసి కొచ్చి చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పల్సర్ సునీల్ సరెండర్ అయ్యాడు. కోర్టు వెలుపల భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు న్యాయమూర్తి చాంబర్లోకి వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Malyalam actor molestation: Main accused arrested as he sneaked into judge's chamber to surrender

ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. నిందితుల తరఫు న్యాయవాదులను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు లాగిపడేశారు. తర్వాత నిందితులను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు.

లొంగిపోవడానికి వచ్చిన నిందితులను గుర్తు తెలియని బయటకు లాక్కెళ్లి, అరెస్టు చేయడంపై డ్యూటీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తామని పల్సర్ సునీల్ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ పైన విచారణను కేరళ హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+