Election Results: కాంగ్రెస్ ఓటమికి కారణమిదే-3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై మమత షాకింగ్ కామెంట్స్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ సాధించిన విజయాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భిన్నంగా స్పందించారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు గల కారణాలపై మమత తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో భాగస్వామిగా ఉన్న టీఎంసీ అధినేత్రి.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలపై స్పందించిన మమతా బెనర్జీ.. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమేనని, ప్రజలది కాదన్నారు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ఇండియా ప్రతిపక్ష కూటమిలో గుబులు రేపింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సొంతంగా ఎన్నికల్లో పోరాడాలన్న నిర్ణయం ఓట్ల విభజనకు ఎలా దారితీసిందో మిత్రపక్షాలు గుర్తుచేస్తున్నాయి.

mamata banerjee reveals reasons behind congress partys defeat in three hindi states

ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో సీట్ల పంపకం లేకపోవడం వల్లే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విశ్లేషించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ ఓటమిపై స్పందిస్తూ.. ప్రాంతీయ పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీపై పోరాటానికి నాయకత్వం వహించాలని సూచించారు. మూడు రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తుల్లేకపోవడం వల్లే నష్టపోయినట్లు తెలిపారు.

తెలంగాణను కాంగ్రెస్ గెలుచుకుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లను కూడా గెల్చుకునేది కానీ.... కొన్ని ఓట్లను ఇండియా పార్టీలు చీల్చుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఇది వాస్తవం అన్నారు. తాము ఆయా రాష్ట్రాల్లో సీట్ల పంపకం చేసుకుందామని ప్రతిపాదించినట్లు మమత గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అంగీకరించకపోవడం వల్ల ఓట్ల విభజన జరిగి ఓడిపోయిందని మమత వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+