విదేశీ మహిళ ముందు మస్టర్‌బేటింగ్: అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో అమెరికన్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించినందుకు ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలోని కొలాబా ప్రాంతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గోపాల్ వాల్మీకి అనే 20ఏళ్ల యువకుడిని బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ ఇన్‌స్పెక్టర్ వినయ్ గాడ్గిల్ తెలిపారు.
సోమవారం ఉదయం అమెరికన్ మహిళ నడకకు వెళ్లగా యువకుడి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఆమె ముందే మస్టర్‌బేటింగ్ చేశాడు. దీంతో ఆమె అతడిని ఫొటో తీసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అప్‌లోడ్ చేసింది.

యువకుడు వేధిస్తున్న సమయంలో తనకు సహాయం చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి కూడా తన పోస్ట్‌లో తెలిపింది. ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మహిళ నుంచి వాంగ్మూలం తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బుధవారం ఉదయం ఆ యువకుడిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ వినయ్ గాడ్గిల్ తెలిపారు.












Click it and Unblock the Notifications