ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, లగ్జరీ కారులో తిరుగుతూ అర్దరాత్రి ?, వీడి దెబ్బకు ఫీజులు ?
బెంగళూరు: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువకుడు దొంగ అవతారంఎత్తాడు. రాత్రిపూట కొబ్బరి బొండాలు దొంగిలించిన ఓ క్యాబ్ డ్రైవర్ ప్రస్తుతం సెంట్రల్ జైలులో ఉన్నాడు. దొంగ స్టోరీ మొత్తం తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయాడు. హైటెక్ టెక్నాలజీ కాలంలో దొంగతనం చెయ్యడానికి ఆ యువకుడు ఎలాంటి ప్లాన్ వేశాడు అని తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ సమీపంలో నివాసం ఉంటున్న మోహన్‌ను ఐటీ హబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోహన్ కొబ్బరి బొండాలు చోరీ చెయ్యడానికి ఉపయోగిస్తున్న రూ 8 లక్షల విలువైన లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు మోహన్ నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులోని హొస్కెరెహళ్లిలోని మంకుతిమ్మన్న గార్డెన్ సమీపంలో కొబ్బరి బొండాల వ్యాపారి రాజన్నకు చెందిన 1,150 కొబ్బరి బొండాలు చోరీ అయ్యాయి.

రాత్రి పూట కొబ్బరి బొండాలు చోరీ కావడంతో మరుసటిరోజు ఆ విషయాన్ని వ్యాపారి రాజన్న గుర్తించలేకపోయాడు. తరువాత కొబ్బరి బొండాలు చోరీ అయిన విషయం తెలుసుకున్న రాజన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన గిరినగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ నేతృత్వంలోని బృందం కొబ్బరి తోగట పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీతో సహా సాంకేతిక సమాచారం సేకరించారు.
సీసీటీవీ పుటేజీల ఆధారంగా హైటెక్ దొంగ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన మోహన్ ఉపాధి వెతుక్కుంటూ ఏడెనిమిదేళ్ల క్రితం బెంగళూరు నగరానికి వచ్చాడు. కుటుంబ సమేతంగా వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్న మోహన్ నీళ్ల వ్యాపారం చేసేవాడు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి కారు తెచ్చుకుని ఓలా, ఉబర్ సేవలు అందించాడు.

ఆ సమయంలో మోహన్ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు అలవాటు పడ్డాడు. దీంతో మోహన్ భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడేందుకు మోహన్ చోరీలు చెయ్యడం అలవాటు చేసుకున్నాడు. ఐదారు నెలలుగా బెంగళూరు నగరంలో రాత్రిపూట కొబ్బరి బొండాలు చోరీ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చోరీ చేసిన కొంబరిబొండాలు తక్కువ ధరకు విక్రయిస్తున్న మోహన్ జల్సాలు చేస్తున్నాడని గిరినగర పోలీసులు తెలిపారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications