ఘోరం.. భార్య తల నరికి.. అదే తలతో 1.5కి.మీ నడుచుకుంటూ..

భార్యతో తలెత్తిన విభేదాల కారణంగా ఆమెను దారుణంగా హత్య చేశాడో భర్త. ఏకంగా తల నరికి.. అదే తలతో 1.5కి.మీ నడుచుకుంటూ వెళ్లాడు. చేతిలో తల పట్టుకుని తిరుగుతున్న అతన్ని చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బహదూర్‌పూర్‌కి చెందిన అఖిలేశ్ రావత్(30)కి, రజనీ(25)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప ఉంది. అయితే కొద్దిరోజుల క్రితమే ఆ చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటినుంచి దంపతులు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో శనివారం మధ్యాహ్నం రావత్ భార్యతో గొడవపడ్డాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి.. పదునైన ఆయుధంతో ఆమె తల నరికాడు.

 man chops off wife head after quarrel walks with head 1.5km in up

అనంతరం అదే తలతో ఆ ఏరియాలో చాలాసేపు తిరిగాడు. చేతిలో తలతో దాదాపు 1.5కి.మీ నడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తాము నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు అతను పారిపోవడానికి యత్నించాడని,ఎట్టకేలకు అతన్ని పట్టుకోగలిగామని ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఇదే ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల క్రితం ఓ అత్యాచార ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆగ్రాకు చెందిన ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థి(20) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. నిందితుడు తనకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+