రేప్ చేసిన యువతినే పెళ్లాడాడు, బయటికొచ్చాడు

Man gets bail after marrying girl who accused him of rape
జైపూర్: తాను అత్యాచారం చేసిన మహిళనే వివాహం చేసుకునేందుకు ఒప్పుకోవడంతో రాజస్థాన్ రాష్ట్ర హై కోర్టు నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో నిందితుడు తన ఇంటి పక్కనే ఉండే అమ్మాయితో పారిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. దీంతో అమ్మాయి తల్లి నిందితుడు తన కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడైన మహ్మద్ ఖాన్‌ను పోలీసులు 2013, నవంబర్ 6న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనతో మోహిసిన్ ఖాన్ శరీరక సంబంధాన్ని కలిగి ఉన్నాడని, అతనితో తనకు వివాహం జరిపించాలని బాధితురాలు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది.

కాగా నిందితుడు మోహిసిన్ ఖాన్ బాధితురాలిని వివాహం చేసుకునేందుకు అంగీకారం తెలిపాడని, అందుకోసమే బెయిల్ కోసం విజ్ఞప్తి చేశాడని ఖాన్ తరపు న్యాయవాది నవాబ్ ఆలీ రాథోర్ పేర్కొన్నారు. డిసెంబర్ 20న చివరి వాదనలను విన్న కోర్టు, డిసెంబర్ 25న వివాహం చేసుకునేందుకు అనుమతించిందని ఆయన తెలిపారు. జనవరి 2లోగా బాధితురాలిని వివాహం చేసుకున్నట్లు తెలిపే సర్టిఫికేట్‌ను తమకు అందజేయాలని బాధితురాలి, నిందితుని తరపు న్యాయవాదులను న్యాయమూర్తి కెఎస్ అహ్లువాలియా ఆదేశించారు.

దీంతో మోహిసిన్ ఖాన్, బాధితురాలు గత వారం జైపూర్ సెంట్రల్ జైలు ఆవరణలోనే వివాహం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇరువురి న్యాయవాదులు వారి వివాహ సర్టిఫికేట్‌ను కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడైన మోహిసిన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వాస్తవ కాపీ అందిన వెంటనే జైలు అధికారులకు అందించి మోహిసిన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయనున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. వారి దంపత్య జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటున్నట్లు ఇరువురి న్యాయవాదులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+