అక్రమ సంబంధం అనుమానం: భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. అతని నుంచి పోలీసులు పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తన భార్య జోగీందరి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానించాడని పోలీసులు చెప్పారు.
అక్రమ సంబంధంపై బుధవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ సందర్భంగా సంజయ్ జోగిందరిని హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
మద్యం సేవించిన మత్తులోనే సంజయ్ జోగిందరిని హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాగొద్దని వారించినందుకు కోపంతో అతను ఆ పనికి ఒడిగట్టినట్లు వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications