అపార్ట్ మెంట్ లో ఒంటరి మహిళ ఫ్లాట్ తలుపులు పగలగొట్టి, కిటికీలో కాండోమ్ ప్యాకెట్, నరకం !

బెంగళూరు: బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ ఫ్లాట్ లో చొరబడటానికి విఫలయత్నం చేశాడు ఓ కామాంధుడు, మహిళ ఇంటి కిటికీలో లైట్ వెయ్యడం, దానిని ఆఫ్ చెయ్యడం ఇలా అర్దగంటకు పైగా ఆమెకు నరకం చూపించాడు. చివరికి కిటికీలో నుంచి మహిళ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోకి కాండోమ్ (నిరోద్) ప్యాకెట్ లు వేసి చిత్రహింసలకు గురి చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవునా ? నిజమా ? గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు ఎలా నమోదు చేసేది ? అంటూ ఆమెను ప్రశ్నించారు. విషయం బయటకు రావడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళ ఫ్లాట్ తలుపులు !

మహిళ ఫ్లాట్ తలుపులు !

బెంగళూరు నగరంలోని పుట్టేనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో ఓ మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. జనవరి 30వ తేదీ రాత్రి తన ఫ్లాట్ లో ఆ మహిళ నిద్రపోయింది. ఆ సమయంలో అపార్ట్ లోని మహిళ ఫ్లాట్ తలుపులు బయట నుంచి కొట్టారు. తలుపులు పదేపదే కొట్టడంతో మహిళ హడలిపోయింది.

100 ఫోన్ చేసిన మహిళ

100 ఫోన్ చేసిన మహిళ

వేకువ జామున 2 గంటల సమయంలో ఎలాంటి మాటలు లేకుండా తలుపులు పదేపదే కొట్టిన వ్యక్తి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఆందోళనకు గురైన మహిళ వెంటనే పోలీసు కంట్రోల్ రూం నెంబర్ 100 కు ఫోన్ చేసింది. పోలీసులకు ఫోన్ చేసిన తరువాత గుర్తు తెలియన వ్యక్తి మహిళ ఫ్లాట్ మెయిన్ డోర్ పక్కనే ఉన్న కిటికీ తీసి ఆమెను బయపెట్టడానికి లైట్ వెయ్యడం, దానిని ఆఫ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

తీరికగా వచ్చిన పోలీసులు

తీరికగా వచ్చిన పోలీసులు

మహిళ ఫిర్యాదు చేసిన అర్దగంట తరువాత (వేకువ జామున 2. 30 గంటలు) పోలీసులు ఆమె ఫ్లాట్ దగ్గరకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. మహిళ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోని టెర్రాస్, బాల్కనీలో పోలీసులు పరిశీలించారు. అప్పటికే అక్కడ నానా హంగామా చేసిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడి నుంచి పరారైనాడు.

రక్తపు మరకలు

రక్తపు మరకలు

మహిళ నివాసం ఉంటున్న ఫ్లాట్ పక్కన ఉన్న మెట్లు, టెర్రాస్ మీద రక్తపు మరకలు ఉన్న విషయం పోలీసులు గుర్తించారు. పోలీసులు వచ్చారని గుర్తించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆత్రుతో పారిపోయే సమయంలో భవనం దూకే సమయంలో అతనికి గాయాలు కావడంతో రక్తపు మరకలు అయి ఉంటాయని మహిళ అనుమానం వ్యక్తం చేసింది.

పోలీసుల నిర్లక్షం ?

పోలీసుల నిర్లక్షం ?

ఇక్కడికి మళ్లీ ఎవరైనా వస్తే తమకు ఫోన్ చెయ్యాలని పోలీసులు ఓ నెంబర్ ఇచ్చి వెళ్లి పోయారని మహిళ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆరోపించారు. ఫోన్ చేసిన అర్దగంట తరువాత ఇంటి దగ్గరకు వచ్చిన పోలీసులు నిర్లక్షంగా తనను విచారణ చేశారని, తూతూ మంత్రంగా వివరాలు సేకరించి వెళ్లిపోయారని మహిళ ఆరోపించింది.

ఫ్రిజ్ పక్కన కాండోమ్ ప్యాకెట్

ఫ్రిజ్ పక్కన కాండోమ్ ప్యాకెట్

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి బయలుదేరుతున్న సమయంలో ఇంటిలోని ఫ్రిజ్ పక్కన కాండోమ్ ప్యాకెట్ కనిపించిందని మహిళ ఆరోపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని, ఇంటికి వచ్చిన పోలీసులు ఆ కాండోమ్ ప్యాకెట్ బయటకు విసిరివేయాలని ఆదేశించారని మహిళ ఆరోపించింది.

సీసీటీవీ 50 సార్లు చూసిన మహిళ

సీసీటీవీ 50 సార్లు చూసిన మహిళ

గుర్తు తెలియని వ్యక్తితో ఆందోళనకు గురైన మహిళ అపార్ట్ మెంట్ కేర్ టేకర్ కు సమాచారం ఇచ్చింది. అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను పరిశీలించారు. సుమారు 50 సార్లుకు పైగా తాను సీసీటీవీ పుటేజీలు చూశానని, అందులో ఉన్న వ్యక్తిని మాత్రం తాను గుర్తించలేకపోయానని ఆ మహిళ ఇంటర్వూ ఇచ్చిన ఆంగ్ల పత్రికకు వివరించింది.

కేసు ఎవరి మీద పెడుతాం ?

కేసు ఎవరి మీద పెడుతాం ?

మరుసటి రోజు తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ఇన్స్ పెక్టర్ కు చెప్పానని, అయితే అందులో కాండోమ్ ప్యాకెట్ వివరాలు వద్దు అని పోలీసులు వారించారని ఆ మహిళ ఆరోపించింది. గుర్తు తెలియని వ్యక్తి మీ ఇంటికి వచ్చి కిటికీలు, తలుపులు కొట్టాడని మేము ఎలా కేసు నమోదు చెయ్యాలి, విచారణ చెయ్యాలని తననే పోలీసులు ప్రశ్నించారని మహిళ ఆరోపించింది. సీసీటీవీ పుటేజీలు, కాండోమ్ ప్యాకెట్ వివరాలు, దుండుగుడు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు అనే వివరాలు ఇచ్చానని మహిళ ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు షాక్ కు గురైనారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని శుక్రవారం (ఫిబ్రవరి 7వ తేదీ) పోలీసులు మీడియాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+