మోడీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: లష్కరే తోయిబాతో కలిసి భారత ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చిన అతన్ని.. నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించాడన్న కారణంతో మరోసారి అరెస్ట్ చేశారు.

కాగా, అగస్టు 28, 2002లో ఫర్హాన్ అలీ 4కేజీల ఆర్డీఎక్స్ తో ఢిల్లీలో పట్టుబడ్డాడుఆ సమయంలో అతని వద్ద ునంచి డిటోనేటర్స్, పిస్టల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫర్హాన్ అలీ మరికొందరితో కలిసి అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Man who plotted Modi’s assassination arrested again

పలువురు సంఘ్ పరివార్ నాయకుల హత్యా ఘటనల్లోను వీరు నిందితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. అలీ సమర్పించిన నకిలీ ధ్రువ పత్రాల్లో పాస్ పోర్టు కూడా నకిలీదే అని తేల్చారు. ఈ పాస్ పోర్టుతో అలీ కువైట్ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. బెయిల్ కండిషన్స్ ను ఉల్లంఘించిన అలీ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

పలు భూ దందాల్లోను అలీ నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అలీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలీ కోసం గాలించిన పోలీసులు అతని ఇంటిపై దాడి చేసిన సమయంలో నకిలీ రేషన్ కార్డులు, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తించారు. ప్రస్తుతం అతని నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A alleged operative of the Lashkar-e-Tayiba who was held for plotting the assassination of Narendra Modi has been arrested again. He was out on bail when the police arrested him for possessing fake documents.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి