Manager: భార్య అకౌంట్ కు Rs. కోట్లు బదిలి చేసి బ్యాంక్ అధికారి ఎస్కేప్, అనంతపురం నుంచి ఎగేసుకుని వెళ్లి !

బెంగళూరు/అనంతపురం: ప్రముఖ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరిన యువకుడు చక్కగా ఉద్యోగం చేశాడు. బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న అతను వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం భార్యతో కలిసి పొరుగు రాష్ట్రంలో కాపురం పెట్టాడు. ప్రతిరోజు బ్యాంక్ కు వెళ్లి వస్తున్నాడు. బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ కావడంతో అతనికి అక్కడ పని చేసే సిబ్బంది, ఆ బ్యాంక్ లో ఖాతాలు ఉన్న ప్రజలు అతనికి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. ఇటీవల బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి రాకుండా మాయం అయిపోయాడు. కొన్ని రోజులు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి రాకపోవడంతో బ్యాంక్ మేనేజర్ మిక్సింగ్ కేసు పెట్టారు. ఇదే సమయంలో అసిస్టెంట్ మేనేజర్ అతని భార్య అకౌంట్ కు కోట్లాదిరూపాయలు నగదు బదిలి చేశాడని గుర్తించి బిత్తరపోయి పోలీసు కేసు పెట్టాడు. అనంతపురంకు చెందిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, ఆయన భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.

అనంతపురం కుర్రాడు

అనంతపురం కుర్రాడు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలోని సిండికేట్ నగర్ లో కుమార్ బోనాల అలియాస్ కుమార్ (33) అనే యువకుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం సంపాధించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగంలో చేరిన కుమార్ బోనాల ఇంతకాలం చక్కగా ఉద్యోగం చేశాడు. ఇంతకాలం బ్యాంక్ లో కుమార్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఉత్తర కన్నడ జిల్లాలో ఉద్యోగం

ఉత్తర కన్నడ జిల్లాలో ఉద్యోగం

బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న కుమార్ రేవతి ప్రియాంకా గుర్రే అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం భార్యతో కలిసి పొరుగు రాష్ట్రంలో కాపురం పెట్టాడు. ప్రతిరోజు బ్యాంక్ కు వెళ్లి వస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఉత్తర కన్నడ జిల్లాలోి యల్లాపురలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ కు కుమార్ బదిలి అయ్యాడు.

మంచి మర్యాద ఇచ్చారు

మంచి మర్యాద ఇచ్చారు

యల్లాపురలోని కోర్టు వీధిలో కుమార్ అతని భార్య రేవతి ప్రియాంకాతో కలిసి కాపురం పెట్టాడు. ప్రతిరోజు బ్యాంక్ కు వెళ్లి వస్తున్నాడు. బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ కుమార్ కు అదే బ్యాంక్ లో పని చేసే సిబ్బంది, ఆ బ్యాంక్ లో ఖాతాలు ఉన్న ప్రజలు అతనికి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. కుమార్ కూడా అందరితో బాగానే ఉండేవాడని సమాచారం.

మాయం అయిపోయిన అసిస్టెంట్ మేనేజర్

మాయం అయిపోయిన అసిస్టెంట్ మేనేజర్

ఈనెల 6వ తేదీ నుంచి కుమార్ బ్యాంకులో విధులకు హాజరుకాలేదు. ముందుగా సెలవు కూడా పెట్టకుండా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కుమార్ ఉద్యోగానికి రాకపోవడం, అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్ కుమార్ బోనాల కనపడటం లేదని యల్లాపుర బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ విఘ్నేశ్వర్ భట్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 భార్య అకౌంట్ కు రూ. 2.69 కోట్లు బదిలి చేసి ఎస్కేప్

భార్య అకౌంట్ కు రూ. 2.69 కోట్లు బదిలి చేసి ఎస్కేప్

బ్యాంక్ మేనేజర్ విఘ్నేశ్వర్ భట్ అకౌంట్స్ పరిశీలించారు. బ్యాంక్ లోని వివిద కరంటె అకౌంట్ల నుంచి అసిస్టెంట్ మేనేజర్ కుమార్ బోనాల అతని భార్య రేవతి ప్రియాంక అకౌంట్ కు రూ. 2. 69 కోట్ల నగదు బదిలి చేశాడని గుర్తించిన బ్యాంక్ సిబ్బంది హడలిపోయారు. బ్యాంక్ అధికారులకు అనుమానం రాకుండా ఏప్రిల్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కుమార్ బోనాల అతని భార్య రేవతి ప్రియాంక పేరుతో నగదు బదిలి చేశాడని గుర్తించిన బ్యాంక్ మేనేజర్ విఘ్నేష్ భట్ యల్లాపుర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

 సార్ ఎక్కడ ఉన్నాడో ?

సార్ ఎక్కడ ఉన్నాడో ?


కేసు నమోదు చేసిన యల్లాపుర పోలీసులు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తదితర ప్రాంతాల్లో కిలాడీ బ్యాంక్ అధికారి కుమార్ బోనాల కోసం గాలిస్తున్నారు. అనంతపురంకు చెందిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కుమార్, ఆయన భార్య రేవతి ప్రియాంక కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+