రాహుల్ గాంధీ కాన్వాయ్ కి చెక్ పెట్టిన పోలీసులు, సార్ మీరు వెళ్లిపోండి, కష్టం !
ఇంపాల్/ మణిపూర్: రిజర్వేషన్ల విషయంలో రెండు కులాలకు సంబందించి జరుగుతున్న గొడవలు హింసకు దారితీశాయి. మణిపూర్ లో రెండు జాతుల మధ్య జరుగుతున్న పోరాటం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మణిపూర్ లో జరుగుతున్న గొడవల కారణంగా ఇప్పటికే వంద మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు మణిపూర్ లో పొలిటికల్ వార్ మొదలు కావడంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.
కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్ ని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు కొంచెం దూరంలో ఉన్న సహాయ శిబిరం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇంపాల్ సమీపంలోని సహాయ శిభిరంలో ఉంటున్న వారిని పరామర్శించి వారి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీకి పోలీసులు షాక్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ తో కలిసి రాహుల్ గాంధీ ఇంపాల్ సమీపంలోని చురచంద్‌పూర్‌కు చేరుకోవడానికి ప్రయత్నించారు. అయితే బిష్ణుపూర్ సమీపంలోనే రాహుల్ గాంధీ కాన్వాయ్ ని పోలీసులు అడ్డగించారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ చెప్పారు. మమ్మల్ని సహాయక శిభిరంలోకి అనుమతించే స్థితిలో లేమని ఇంపాల్ పోలీసులు చెబుతున్నారని కేసీ. వేణుగోపాల్ ఆరోపించారు..
రాహుల్‌గాంధీతో చేతులు కలిపేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉన్నారని, అయినా మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో అర్థం కావడం లేదని కేసీ. వేణుగోపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు. రాహుల్ గాంధీ చురచంద్‌పూర్‌కు వెళ్లే మార్గంలో కొందరు హింసకు పాల్పడే అవకావం ఉందని సమాచారం అందడంతో ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నామని పోలీసు అధికారులు పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.

రాహుల్ గాంధీ రెండు రోజులు మణిపూర్ లో పర్యటించడానికి వెళ్లారు. మణిపూర్ లో నాలుగు సహాయక శిబిరాలు ఉన్నాయి, అక్కడ ఘర్షణల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను ఉంచారు.

ఇంతలో ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది, మణిపూర్ లో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలను విద్యార్థి సంఘాలు ఖండించాయి. ప్రస్తుత సంక్షోభంలో కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించవలసి వచ్చిందిని స్టూడెంట్
యూనియన్ చెప్పింది. మణిపూర్‌లో ప్రస్తుత సంక్షోభం కాలక్రమేణా మణిపూర్‌ను పాలించిన వరుస ప్రభుత్వాలు చేసిన రాజకీయ తప్పిదాల ఫలితమేనని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర పోషించాలని విద్యార్థి సంఘాలు మనవి చేశాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications