మణిపూర్ మహిళలపై ఘోరం: ప్రధాన నిందితుడు సహా నలుగురు అరెస్ట్

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహళల్ని నగ్నంగా ఊరేగించి లైంగిక దాడికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. గురువారం ఉదయం ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. సాయంత్రం వరకు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ప్రధాన నిందితుడిని 32 ఏళ్ల హురైన్ హెరదాస్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతడ్ని తోబల్ జిల్లాలో అరెస్ట్ చేశారు. మే 4న ఈ దారుణ ఘటన చేసుకోగా.. ఇప్పటి వరకు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై మణిపూర్ తోపాటు దేశ వ్యాప్తంగా అసహనం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించకపోతే తామే చర్యలు తీసుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Manipur Women Paraded Naked: Four accused Arrested After Outrage Over Incident

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. 140 కోట్ల మంది ప్రజలకు ఈ ఘటన అవమానకరమని ప్రధాని మోడీ అన్నారు. తన హృదయం బాధ, కోపంతో నిండిపోయిందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఈ క్రమంలో మణిపూర్ పోలీసులు వెంటనే స్పందించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం బీరేన్ సింగ్ స్పష్టం చేశారు.

చట్ట ప్రకారం నిందితులకు మరణశిక్ష విధించేందుకు కూడా వెనుకాడబోమని అన్నారు. మహిళలపై నేరాల్లో ఇదే చివరిది కావాలని సీఎం బీరేన్ సింగ్ అన్నారు. మన తల్లి, సోదరిలను గౌరవించినట్లే ఇతర మహిళలను కూడా గౌరవించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. ఇది ఇలావుండగా, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. నిందితుడు హురైన్ ఇంటికి నిప్పంటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కానీ, వారి ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని కొందరు స్థానిక మహిళలు పేర్కొనడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+