వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటకొస్తే గుర్తొస్తుంది.. అదే కారణం, సచిన్ ఎవరితో పోటీ పడ్డాడంటే..: మోడీ

విద్యార్థులంతా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన రేడియోలో ప్రసంగించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విద్యార్థులంతా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన రేడియోలో ప్రసంగించారు.

కాశ్మీర్‌లో ఇటీవల మంచు చరియలు విరిగిపడి మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులకు మనమందరం శ్రద్ధాంజలి ఘటించాలన్నారు.

పన్నీరు పావులు: శశికళ ముందు పెద్ద పరీక్ష.. భవిష్యత్తు ప్రశ్నపన్నీరు పావులు: శశికళ ముందు పెద్ద పరీక్ష.. భవిష్యత్తు ప్రశ్న

పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతూ ఉంటారని, విద్యార్థులు ఆందోళన చెందితే పరీక్ష తప్పే ప్రమాదం ఉందని, కొందరికి పరీక్ష రాసేటప్పుడు చదివినది గుర్తుకు రాదని అన్నారు.

 Mann ki Baat: PM Modi shares success mantra with students, says compete with yourself

బయటకువ వచ్చిన వెంటనే గుర్తుకు వస్తుందన్నారు. దీనికి కారణం ఒత్తిడికి గురికావడమే అన్నారు. చూచిరాతలో చూపించిన శ్రద్ధ చదువడంతో చూపెడితే విద్యార్థులు అద్భుత ఫలితాలు రాబట్టవచ్చన్నారు.

అంతర్మథనమే విజయవంతమైన క్రీడాకారుల విజయ రహస్యం అన్నారు. సచిన్‌ టెండుల్కర్ 20 ఏళ్లపాటు తన రికార్డులను తానే అధిగమిస్తూ వచ్చారని మోడీ పేర్కొన్నారు. సచిన్ తనకు తానే పోటీ పడ్డారన్నారు.

ఇతర వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. మొదటిది వాళ్లకంటే చురుకైన వ్యక్తులం అనిపిస్తుందని, రెండోది వాళ్లతో సమానంగా ఉన్నామని అనిపిస్తుందని, మూడోది వాళ్లకంటే తక్కువగా కనిపిస్తామన్నారు.

ఇతరులతో పోటీ పడి ఓడిపోతే బాధపడతామని, ఒకవేళ గెలిస్తే గర్వంతో విర్రవీగుతామని, ఇవి సరికాదన్నారు. దీని వల్ల వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెప్పారు. మనం మనతోనే పోటీ పడాలన్నారు. గతంలో చేసిన పని కంటే మెరుగ్గా ఎలా చేయాలో ఆలోచించాలన్నారు.

English summary
Prime Minister Narendra Modi today addressed the nation through the monthly 'Mann ki Baat' radio programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X