సీఎం బలపరీక్షకు ముందే రెబల్ ఎమ్మెల్యేల మీద వేటు: ఏజీకి హైకోర్టు ప్రశ్న, స్పీకర్ తో !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు తమ మీద ఎక్కడ అనర్హత వేటు వేస్తారో అనే భయంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలోని కొడుగు రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్న టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు తమ మీద వేటుపడకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.

స్పీకర్ నోటీసులు: నేడు డెడ్ లైన్: అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సీఎం పళని ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద తిరుగుబాటు చేసిన దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు 17 రోజుల పాటు పుదుచ్చేరి సమీపంలోని రిసార్ట్ లో తలదాచుకున్నారు. పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యే జక్కయ్యన్ జంప్ అయ్యారు.

Mardras HC asks AG clarify whether TN assembly Speaker is going disqualify 18 AIADMK MLAs

చెన్నై చేరుకున్న జక్కయ్యన్ సీఎం పళనిసామికి మద్దతు ఇవ్వడంతో మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారో అనే భయంతో ఇటీవల కర్ణాటకలోని కొడుగు సమీపంలోని రిసార్ట్ కు తరలించారు. తమిళనాడు స్పీకర్ మూడో సారి ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి నేటితో (గురువారం) గడువు పూర్తి అవుతుంది.

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేకు హైకోర్టు వార్నింగ్: రూ. లక్ష ఫైన్, తమాషానా, శశికళకు !

ఈ సందర్బంలోనే రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిర్వహించక ముందే రెబల్ ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేస్తారా ? అంటూ గురువారం మద్రాస్ హైకోర్టు తమిళనాడు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. స్పీకర్ ధనపాల్ తో చర్చించిన తరువాత పూర్తి సమాచారం ఇస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో చెప్పడంతో విచారణ వాయిదా వేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court asks AG to clarify whether Tamilnadu Assembly Speaker is going to disqualify 19 AIADMK MLAs before floor test.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X