Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Marriage: గంట ముందు పెళ్లి కొడుక్కి గంటకొట్టి చెక్కేసిన పెళ్లికూతురు, బ్యూటీపార్లల్, చింపేసి !

చెన్నై/ మదురై: పెద్దలు కుదుర్చిన పెళ్లికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అసలే పెద్దలు నిశ్చియించిన పెళ్లి గ్రాండ్ గా జరిపించాలని అమ్మాయి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెద్ద కల్యాణమండపంలో పెళ్లికి భారీ ఏర్పాట్లు చేశారు. పెళ్లి కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కల్యాణమండపం చేరుకున్నారు. జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటామని, నేను అందంగా లేకపోతే ఎలా ?, బ్యూటీపార్లల్ కు వెళ్లి వస్తానని చెప్పిన పెళ్లి కూతురు గంట ముందు పెళ్లి కొడుక్కి గంటకొట్టేసి అటునుంచి అటే చెక్కేసింది. కల్యాణమంపడపంలో పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు విషయం తెలుసుకుని రెచ్చిపోయాడు. కల్యాణమండపం మొత్తం చించేసిన పెళ్లి కొడుకు మీ అంతు చూస్తా అంటూ చిందులు వేస్తున్నాడు.

అందమైన అమ్మాయితో పెళ్లి

అందమైన అమ్మాయితో పెళ్లి

చెన్నై సిటీ సమీపంలోని పూందమల్లి సమీపంలోని చెంబరంపాక్కం ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజు (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి మధురాంతకం ప్రాంతంలో నివాసం ఉంటున్న అందమైన రజనీ (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

గ్రీన్ సిగ్నల్.... గ్రాండ్ గా పెళ్లి

గ్రీన్ సిగ్నల్.... గ్రాండ్ గా పెళ్లి

పెళ్లి చేసుకోవడానికి రాజు, రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందమైన యాపిల్ పండులాంటి అమ్మాయి తనకు భార్య కాబోతుందని రాజు మురిసిపోయాడు. నసరత్ పేట్ లోని ఓ కల్యాణమంపడంలో గ్రాండ్ గా పెళ్లి చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం రిసెప్షన్, గురువారం ఉదయం ముహూర్తం నిర్ణయించారు.

ఎగరేసుకుని వెళ్లిపోయిన పెళ్లి కొడుకు

ఎగరేసుకుని వెళ్లిపోయిన పెళ్లి కొడుకు

పెళ్లికి బంధువులు అందరూ రావడంతో బుధవారం సాయంత్రం రాజు కుటుంబ సభ్యులు, స్నేహితులను వెంటపెట్టుకుని నసరత్ పేట్ లోని కల్యాణమండపం దగ్గరకు వెళ్లిపోయాడు. కల్యాణమండపంలో అప్పటికే రాజు, రజనీ ఫోటోలతో పెద్దపెద్ద ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పూలతో కల్యాణమండపం పూర్తిగా అలంకరించారు.

జీవితంలో ఒకేసారి పెళ్లి జరుగుతుందని !

జీవితంలో ఒకేసారి పెళ్లి జరుగుతుందని !

జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకుంటామని, పెళ్లి రోజు తాను అందంగా లేకుంటే ఎలా ?, పెళ్లికి వచ్చిన వాళ్లు అందరూ చూస్తారు, ఫోటోలు, వీడియోలు తీస్తారు, పెళ్లి ఫోటోలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాము కదా, అందుకే నేను బ్యూటీపార్లల్ కు వెళ్లి వస్తానాని రజనీ ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

పెళ్లి కొడుక్కు బీపీ పెరిగిపోయింది

పెళ్లి కొడుక్కు బీపీ పెరిగిపోయింది

రిసెప్షన్ కు టైమ్ దగ్గర పడుతుండటం, బంధువులు ఒక్కొక్కరు కల్యాణమండపంలోకి రావడం మొదలు పెట్టడంతో పెళ్లి కొడుక్కి టెన్షన్ మొదలైయ్యింది. పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ కల్యాణమంపడపంలో అడుగుపెట్టకపోవడంతో పెళ్లి కొడుక్కు బీపీ, షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.

రేయ్ రాజు..... పెళ్లి కూతురు జంప్

రేయ్ రాజు..... పెళ్లి కూతురు జంప్

ఏం జరిగిందో వెళ్లి చూడాలని పెళ్లి కొడుకు రాజు అతని స్నేహితులను పెళ్లి కూతురు రజనీ ఇంటికి పంపించారు. రజనీ ఇంటికి వెళ్లి తిరిగి కల్యాణమండపం చేరుకున్న ఫ్రెండ్స్ రేయ్ రాజు..... పెళ్లి కూతురు జంప్ అంటరా, ఆమె కోసం ఫ్యామిలీ మొత్తం వెతుకుతోందిరా అంటూ చావుకబురు చల్లాగా చెప్పారు.

చింపేసి చిందులు వేసిన పెళ్లి కొడుకు

చింపేసి చిందులు వేసిన పెళ్లి కొడుకు

ఫ్రెండ్స్ చెప్పిన మాటతో అంతవరకు ఓపిగా ఉన్న పెళ్లి కొడుకు రాజు రెచ్చిపోయాడు. దీనెమ్మ జీవితం, కల్యాణమండపానికి రప్పించి ఇంత అవమానం చేస్తారా, పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి, రిసెప్షన్ కు గంట ముందు అది ఎవరితో లేచిపోయింది అంటూ రాజు ఆవేశంతో ఊగిపోయాడు. కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన రాజు, రజనీల పెళ్లి ఫెక్సీలు, బ్యానర్లు, అలంకరించిన పూల డెకరేషన్ మొత్తం చింపేసిన పెళ్లి కొడుకు రాజు రగిలిపోయాడు.

నష్టపరిహారం కావాలి..... అంతే

నష్టపరిహారం కావాలి..... అంతే

మాకు నస్టపరిహారం చెల్లించాలని, మాకు అవమానం జరిగిందని, పెళ్లి కూతురి మీద కేసు నమోదు చెయ్యాలని రాజు, అతని కుటుంబ సభ్యులు నసరత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇంత హంగామా జరిగినా పెళ్లి కూతురు రజనీ ఆచూకి మాత్రం చిక్కకపోవడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+