ఇంట్లో చొరబడి పెళ్లికూతుర్ని రేప్ చేసి చంపేసిన మాజీ బాయ్ ఫ్రెండ్, గేమ్స్ ఆడుతావా ?
బెంగళూరు/విల్సన్ గార్డెన్: యువతి, యువకుడికి పరిచయం కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి ప్రేమికులు హ్యాపీగా తిరుగుతున్నారు. ప్రియురాలిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఆమెతో సంతోషంగా ఉండాలని ప్రియుడు అనేక కలలుకన్నాడు. అయితే ప్రియురాలికి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. అమ్మాయి ఇంట్లో పెళ్లి పనులు జోరుగా చేస్తున్నారు. ప్రియురాలి ఇంటిలో చోరబడిన ప్రియుడు ఆమె మీద అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేసి చంపేయడం కలకలం రేపింది.

బెంగళూరులో లవర్స్
బెంగళూరులోని కేపీ అగ్రహార ప్రాంతంలో మనోజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ లో షాలిని (23) అనే యువతి నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం మనోజ్, షాలినికి పరిచయం అయ్యింది. రానురాను మనోజ్, షాలిని ప్రేమించుకున్నారు. ప్రేమికులు మనోజ్, షాలిని బెంగళూరు సిటీలో రౌండ్స్ వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

మ్యాటర్ లీక్..... ప్రియురాలి పెళ్లి ఫిక్స్
చాలాకాలం నుంచి మనోజ్, షాలిని సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరిగారు. అయితే ప్రియురాలి షాలిని ఇంట్లో మనోజ్ మ్యాటర్ తెలిసిపోయింది, పరిస్థితి చెయ్యిదాటిపోతుందని అనుకున్న షాలిని కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో అతని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంట్లో చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి షాలిని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రియుడికి గుడ్ బై చెప్పాలని షాలిని డిసైడ్ అయ్యింది.

రగిలిపోయిన ప్రియుడు
ప్రియురాలు షాలిని రానురాను దూరం కావడం, ఫోన్ కాల్స్ బ్లాక్ చెయ్యడంతో మనోజ్ కు అనుమానం వచ్చింది. ప్రియురాలు షాలిని వ్యవహారం గురించి ఆరా తీశాడు. షాలినికి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఆమె పెళ్లిపనుల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారని మనోజ్ కు తెలిసింది. ప్రియురాలు షాలినితో మాట్లాడాలని మనోజ్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే షాలిని మాత్రం ప్రియుడు మనోజ్ ను పూర్తిగా దూరం పెట్టేసింది.

ప్రియురాలి ఇంట్లోకి వెళ్లి గొడవ చేసిన ప్రియుడు
మంగళవారం సాయంత్రం ప్రియురాలు షాలిని ఒక్కటే ఇంటిలో ఉందని, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లిపనుల మీద బయటకు వెళ్లారని మనోజ్ కు తెలిసింది. ప్రియురాలు షాలిని ఇంట్లోకి వెళ్లిన మనోజ్ నన్ను ఎందుకు మోసం చేశావు అని ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మనోజ్ అతని ప్రియురాలి మీద దాడి చేశాడు.

ప్రియురాలిని రేప్ చేసి చంపేసిన ప్రియుడు
తరువాత ప్రియురాలు షాలిని మీద బలవంతంగా అత్యాచారం చేసిన మనోజ్ ఆమెను చంపేసి అక్కడి నుంచి పరారైనాడు, ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు షాలికి హత్యకు గురైన వియం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియురాలు షాలిని మీద అత్యాచారం చేసి హత్య చేసిన మనోజ్ అతని ఇంటికి వెళ్లి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మనోజ్ ను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ప్రియురాలి మర్మాంగం మీద గాయాలు
షాలిని మీద బలవంతంగా లైంగిక దాడి జరిగిందని, ఆమె మర్మాంగం మీద గాయాలు కావడంతో ఎక్కువగా రక్తం పోయిందని, అత్యాచారం చేసిన తరువాత ఆమె ముఖం మీద తలదిండుపెట్టి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసిందని విన్సల్ గార్డెన్ పోలీసులు చెప్పారు. మనోజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications