Marriage: వారం ముందు పెళ్లి, ఇంట్లో భార్య, వీధిలో భర్త ఆత్మహత్య, మూడురాత్రుల్లో ఏం జరిగింది ? !
చెన్నై/విల్లుపురం: యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని అమ్మాయి, అబ్బాయి వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. బంధువులు, స్నేహితులు, ఊర్లో వాళ్ల సమక్షంలో చాలా సందడిగా, వాళ్లకు ఉన్నంతలోనే గ్రాండ్ గానే పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తరువాత శోభనంతో పాటు మూడు రాత్రులు భర్త ఇంటిలో భార్య కాలం గడిపింది. మరో మూడు రాత్రులు భార్య పుట్టింటికి వెళ్లిన భర్త అక్కడే ఉన్నాడు. అక్కడా కొత్త దంపతులకు మూడు రాత్రులు గడిసిపోయాయి. వివాహం జరిగిన ఇంటిలో పెళ్లికూతురితో పాటు పెళ్లికొడుకు శవం కనిపించడటం కలకలం రేపింది.

పెళ్లి ఫిక్స్ చేసిన పెద్దలు
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని అవలూరు పేట్ లో చిన్నస్వామి అనే యువకుడు, మంజుల అనే యువతి నివాసం ఉంటున్నారు. ఒకే ఊరి వాళ్లు కావడం, ఒకటే కులం కావడంతో ఇద్దరి పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు కొంతకాలంగా మాట్లాడుకుంటున్నారు.

సంతోషంగా పెళ్లి చేసుకున్నారు
పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని మంజుల, చిన్నస్వామి వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. ఒకటికి పదిసార్లు మంజులను కూడా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి విషయంలో చర్చలు జరిపారని తెలిసింది. మంజుల, చిన్నస్వామి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బంధువులు, స్నేహితులు, ఊర్లో వాళ్ల సమక్షంలో చాలా సందడిగా, వాళ్లకు ఉన్నంతలోనే మంజుల, చిన్నస్వామిల పెళ్లి గ్రాండ్ గానే పెళ్లి జరిగింది.

ఇంట్లో కొత్త పెళ్లి కూతురు
వివాహం జరిగిన తరువాత శోభనంతో పాటు మూడు రాత్రులు కొత్త పెళ్లి కొడుకు చిన్నస్వామి ఇంటిలో జరిగింది. మూడు రోజుల పాటు మంజుల ఆమె భర్త ఇంటిలో కాలం గడిపింది. మరో మూడు రాత్రులు భార్య మంజుల పుట్టింటికి వెళ్లిన చిన్నస్వామి అక్కడే ఉన్నాడు. కొత్త అల్లుడికి ఏం కావాలి అడిగి అత్తారింటి వాళ్లు వంటలు చేసి పెట్టారు.

ఆ ఇంట్లో ఏం జరిగింది ?
పెళ్లికూతురు బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్న సమయంలో కుప్పకూలిపోయింది. వెంటనే మంజులను ఆసుపత్రికి తరలించారు. విషం సేవించడం వలన అప్పటికే మంజుల చనిపోయిందని వైద్యులు చెప్పారు. భార్య మంజలు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న చిన్నస్వామి అత్తారింటి దగ్గర నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని చిన్నస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం జరిగిన ఇంటిలో పెళ్లికూతురితో పాటు పెళ్లికొడుకు శవం కనిపించడటం కలకలం రేపింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications