Marriage: 15 రోజుల క్రితం పెళ్లి, బర్త్ డే పార్టీలో కొత్త పెళ్లి కొడుకును నరికి చంపేశారు. పక్కాస్కెచ్ !
బెంగళూరు: యువకుడు పెళ్లి చేసుకుని అతని భార్యతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. రెండు వారాల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో యువతి, యువకుడు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. కొత్త పెళ్లికొడుకు. కొత్త పెళ్లి కూతురు ఇరు వైపుల బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. కొత్త పెళ్లి కొడుకు అతని ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీలు ఇచ్చాడు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దామని కొత్త పెళ్లి కొడుకు స్నేహితులు ప్లాన్ వేసుకున్నారు. రాత్రి ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు కొత్త పెళ్లి కొడుకు హాజరైనాడు. రాత్రి బర్త్ డే చేసుకుంటున్న యువకుడు కేక్ కట్ చేసిన తరువాత ఫ్రెండ్స్ పార్టీ మొదలుపెట్టారు. ఆ సమయంలో బైక్ లో వెళ్లిన కొందరు యువకులు వేటకొడవళ్లు, కత్తులు తీసుకుని కొత్త పెళ్లి కొడుకును ఇష్టం వచ్చినట్లు నరికేశారు. బర్త్ డే పార్టీ చేసుకుంటున్న యువకుడితో పాటు ఫ్రెండ్స్ ప్రత్యర్థులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారికి కత్తిపోట్లు పడ్డాయి. కొత్త పెళ్లి కొడుకును నరికి చంపేసిన వ్యక్తులను పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించడంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

ఉద్యోగం చేస్తున్న యువకుడు
తమిళనాడులోని దిండుగల్ లోని హనుమంత్ నగర్ లో పళనిస్వామి నివాసం ఉంటున్నాడు. పళనిస్వామికి ప్రభాకరన్ అలియాస్ ప్రభా (26) అనే కుమారుడు ఉన్నాడు. ప్రభాకరన్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని భార్యతో జీవితాంతం సుఖంగా ఉండాలని ప్రభాకరన్ అనుకున్నాడు.

15 రోజుల క్రితమే పెళ్లి
రెండు వారాల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో తెన్రాల్ సెల్లీ అనే యువతి, ప్రభాకరన్ సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. కొత్త పెళ్లికొడుకు ప్రభాకరన్. కొత్త పెళ్లి కూతురు తెన్రాన్ సెల్వీ ఇరు వైపుల బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. కొత్త పెళ్లి కొడుకు ప్రభాకరన్ అతని ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీలు ఇచ్చాడు.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ
మంగళవారం రాత్రి చిలవత్తూరులోని ఎయిన్ పోర్టు టౌన్ లో నివాసం ఉంటున్న స్నేహితుడు సూర్యా పుట్టిన రోజు వేడుకలో ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దామని కొత్త పెళ్లి కొడుకు ప్రభాకరన్ స్నేహితులు ప్లాన్ వేసుకున్నారు. రాత్రి ఫ్రెండ్ సూర్యా బర్త్ డే వేడుకలకు కొత్త పెళ్లి కొడుకు ప్రభాకరన్, అతని ఫ్రెండ్స్ కార్తీక్ గుణశేఖరన్, రాజు తదితరులు హాజరైనాడు.

కొత్త పెళ్లి కొడుకును నరికి చంపేశారు
రాత్రి బర్త్ డే చేసుకుంటున్న సూర్యా కేక్ కట్ చేసిన తరువాత అతని ఫ్రెండ్స్ పార్టీ మొదలుపెట్టారు. ఆ సమయంలో బైక్ లో వెళ్లిన కొందరు యువకులు వేటకొడవళ్లు, కత్తులు తీసుకుని కొత్త పెళ్లి కొడుకు ప్రభాకరన్ ను ఇష్టం వచ్చినట్లు నరికేశారు. బర్త్ డే పార్టీ చేసుకుంటున్న సూర్యాతో పాటు కార్తీక్, గుణశేఖరన్ తదితరులు ప్రభాకరన్ మీద దాడి చేస్తున్న వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కార్తీక్ కు కత్తిపోట్లు పడ్డాయి.

పక్కాప్లాన్ తో పని ముగించేశారు
కొత్త పెళ్లి కొడుకు ప్రభాకరన్ ను నరికి చంపేసిన వ్యక్తులను పట్టుకోవడానికి ఎయిర్ పోర్టు టౌన్ లోని స్థానికులు ప్రయత్నించడంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు. ప్రభాకరన్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని దిండుగల్ పోలీసు అధికారులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications