అసభ్యత: బాడీ గార్డ్స్‌తో నటి నగ్మా జోరుగా... (పిక్చర్స్)

లక్నో: ప్రముఖ నటి నగ్మా ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. అయితే, ప్రచారం సమయంలో తనకు ఎదురైన ఇటీవలి అనుభవాల దృష్ట్యా రక్షణ కోసం ఆమె బాడీ‌గార్డ్స్‌ను నియమించుకున్నారట.

మీరట్ ఎన్నికల ప్రచారంలో నగ్మా జోరుగా పాల్టొంటున్నారు. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. అయితే ఆమె ప్రసంగం వినడం కంటే ఆమెను చూసేందుకు అందరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

నగ్మా కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా మీరట్ లోకసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె కొద్ది రోజుల క్రితం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

నగ్మా

నగ్మా

మీరట్ నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మాకు ఇటీవల రెండు చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. అవి సంచలనం రేపాయి.

నగ్మా

నగ్మా

నగ్మా పట్ల అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించినగా వార్తలు వచ్చాయి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనతో నగ్మా దిగ్భ్రాంతికి గురయ్యారు.

నగ్మా

నగ్మా

హపూర్ వచ్చిన నగ్మాను స్థానిక ఎమ్మెల్యే గజరాజ్ ఆహ్వానించారు. ఈ సమయంలో ఆయన అందరు చూస్తుండగానే చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

నగ్మా

నగ్మా

తన పైన చేయి వేసిన గజరాజ్ పైన నగ్మా ఆగ్రహించారు. ఆయన చేతిని తీసేశారు. ఆమె అక్కడ ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత నగ్మా ఓ ప్రకటన చేశారు. తనను గజరాజ్ ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయలేదని చెప్పారు.

నగ్మా

నగ్మా

ఆ తర్వాత నగ్మా గత గురువారం ఓ యువకుడి చెంప వాయించారు. మీరట్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు ఆమెను తాకాడు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన నగ్మా అతని చెంపను చెల్లుమనిపించింది.

నగ్మా

నగ్మా

ఈ సంఘటనకు ఒక్కసారిగా అందరూ ఆశ్యర్యపోయారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా నగ్మా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

నగ్మా

నగ్మా

గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించింది. నగ్మాను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడాలని వచ్చారు.

నగ్మా

నగ్మా

వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి కష్టతరంగా మారింది. ఈ సమయంలోనే ఆమెను దగ్గర నుంచి చూడాలని ఓ యువకుడు ఆమెను తాకేశాడు. దీంతో నగ్మా కోపం తారాస్థాయికి చేరింది. ఆ యువకుడి చెంపను చెల్లుమనిపించింది.

నగ్మా

నగ్మా

ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మీరట్‌లో అడుగుపెట్టనని ఘటన అనంతరం నగ్మా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఆమె సొంత భద్రతతో ప్రచారానికి వెళ్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+