జమ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్ర విచ్ఛిన్నం .. ఉగ్రవాదుల నెట్ వర్క్ పై మెరుపు దాడులు, ఏడుగురు అరెస్ట్
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతను పనిగా పెట్టుకున్న జమ్మూకాశ్మీర్ పోలీసులు మరో ఉగ్రవాదుల కుట్రను విచ్ఛిన్నం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల నెట్ వర్క్ పై నిఘా పెట్టిన పోలీసులు , భద్రతా దళాలు సంయుక్తంగా ఆకస్మిక దాడులు జరిపారు. ఈ ఆకస్మిక తనిఖీలలో ఏడుగురు ఉగ్రవాదుల నెట్ వర్క్ ను విచ్చిన్నం చేసి వారిని అరెస్ట్ చేశారు . వారి వద్ద నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

షోపియాన్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలలో ఏడుగురు అరెస్ట్ ..
భారీగా ఆయుధాలు , మందుగుండు సామాగ్రి స్వాధీనం
జమ్మూకాశ్మీర్లో షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ జిల్లాలో ఉగ్రవాదులపై ఎన్కౌంటర్లు కొనసాగించిన పోలీసులు, షోపియాన్ జిల్లాపై ప్రధానంగా నిఘా పెట్టారు. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా ఏడుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను, 3 ఏకే 47 తుపాకులను, 105 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భారత ఆయుధ చట్టం క్రింద ఏడుగురిపై కేసులు నమోదు
భారత ఆయుధ చట్టం 13,18,20,23,38, యుఎల్‌ఐ చట్టాల ప్రకారం ఏడుగురు ఉగ్రవాదులపై కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేయడం అతిపెద్ద విజయంగా పోలీసులు చెప్తున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో సమియుల్లా ఫరూక్ చోపాన్ (మిమెండర్ నివాసి), హిలాల్ అహ్మద్ వాని (దాచిపోరా), రమీజ్ వాని (దాచిపోరా), రౌఫ్ అహ్మద్ వాని (దాచిపోరా), జాహిద్ హుస్సేన్ వాని (దాచిపోరా), ఫైజాన్ అహ్మద్ రాథోడ్, షాహిద్ అహ్మద్ రాథార్ (వెహిల్ ) కు చెందిన వారు ఉన్నారు.

ఉగ్రవాదుల స్థావరంగా షోపియాన్ జిల్లా ... ఉగ్రమూకకు చెక్ పెట్టే పనిలో పోలీసులు
ఏడుగురిని అరెస్టు చేయడం, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థ విచ్ఛిన్నమైనదని , ఇండియాలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులకు చెక్ పెట్టడం లో తాము విజయం సాధించామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్, పాంపూర్ ల ప్రాంతాల్లో చాలా సందర్భాలలో ఎన్ కౌంటర్లు జరిగాయి . ముఖ్యంగా ఈ జిల్లాలలో అక్రమంగా చొరబడిన టెర్రరిస్టులు తలదాచుకుంటున్నారు. ఇక వీరిని వెతికి పట్టుకుని ఉగ్ర మూకకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు జమ్మూ పోలీసులు .
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications