వాట్సాప్ వీడియో కాల్... హస్త ప్రయోగం చేస్తూ నటికి వేధింపులు... పోలీసులకు ఫిర్యాదు..

ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ ముంబైకి చెందిన ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత శుక్రవారం ఆ వ్యక్తి తనకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొంది. వీడియో కాల్‌లో అతను హస్త ప్రయోగం చేసినట్లు ఆరోపించింది. ఆ స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు అందజేసి అతనిపై కేసు నమోదు చేసింది.

బాధితురాలి కథనం ప్రకారం... సెల్ఫ్ డిఫెన్స్ ట్రెయినర్‌ కూడా అయిన ఆ నటి(32)కి శుక్రవారం (డిసెంబర్ 11) గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. యూకె కోడ్‌తో ఉన్న ఆ కాల్‌ను రెండుసార్లు ఆమె లిఫ్ట్ చేయలేదు. మూడోసారి అలా లిఫ్ట్ చేసిందో లేదో... అవతలి వ్యక్తి అసభ్యకర రీతిలో కనిపించాడు. అతను హస్త ప్రయోగం చేస్తున్నట్లు గమనించిన ఆ నటి... వెంటనే స్క్రీన్ షాట్స్ తీసింది.

 masturbating on Whatsapp video call Man booked after an actress complaint to police

ఫోన్ కాల్ తర్వాత ఆ వ్యక్తి.. ఆమెను పేరుతో సంబోధిస్తూ మెసేజ్‌ కూడా చేశాడు. 'నచ్చిందా.?' అంటూ వెకిలి మాటలు మాట్లాడాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన ఆ నటి మెసేజ్‌ల ద్వారానే అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో అతను ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. తన వయసు 20 ఏళ్లు అని... విదేశాల్లో చదువుకుంటున్నానని చెప్పాడు. తన స్నేహితురాలికి చేయబోయి పొరపాటున ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే అతని మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

Recommended Video

    #ViralVideo : అరుదైన వ్యాధి తో బాధ పడుతున్న బామ్మ || Oneindia Telugu

    ముంబైలోని వెర్సోవా పోలీసులు ఆ నటి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 354 ఏ,సెక్షన్ 509 ఏ,ఐటీ యాక్ట్ 67ఏ కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఠాకూర్ తెలిపారు. గతేడాది కూడా 8 గుర్తు తెలియని ఫోన్ నంబర్స్ నుంచి ఇలాగే వేధింపులు ఎదురైనట్లు ఆ నటి తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఆమె చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+