వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీపర్ పోస్టు: ఎంబీఏ, పీజీ, బీటెక్ అభ్యర్థుల దరఖాస్తు!

అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు స్వీపర్ (సఫాయి కర్మచారీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడైంది. దీంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి.

|
Google Oneindia TeluguNews

లక్నో: భారతదేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఉదంతం వెల్లడిస్తోంది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు పట్టాలు చేతబట్టి యూనివర్సిటీలు, కళాశాలల నుంచి బయటపడుతున్నారు. ఉద్యోగాలు మాత్రం వందల సంఖ్యలోనే ఉంటున్నాయి. దీంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నారు.

ఈ నేపథ్యంలో అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు స్వీపర్ (సఫాయి కర్మచారీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడైంది. దీంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. స్వీపర్ ఉద్యోగానికి ఎంబీఏ, బీటెక్, పీజీ, ఎంటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు బారులు సైతం తీరారు.

 MBAs And BTechs Clean Drains To Qualify As Sweepers In Uttar Pradesh: Report

250 ఖాళీలు ఉండగా, 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు రావడం గమనార్హం. కాగా, ఈ ఉద్యోగాలకు కేవలం హిందీ రాయడం, చదవడం వస్తే సరిపోతుందని, అదే విద్యార్హత అని అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయినా, ఉన్నత విద్యనభ్యసించిన వారు సైతం ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని బట్టి చూస్తే మనదేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

దరఖాస్తుదారులు భారీ ఎత్తున ఉండడంతో, అభ్యర్థులకు డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నామని అలహాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు.

English summary
People with graduate and post-graduate qualifications, including BTech and MBA degrees, were among the candidates who recently appeared for the practical examination to become sweepers with the Allahabad Municipal Corporation, The Times of India reported today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X