Iltija Mufti: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో మరో వారసురాలి ఎంట్రీ ! ఇల్తిజా ముఫ్తీ అరంగేట్రం..!

జమ్మూకశ్మీర్ లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ మూడు విడతల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే నెల 18, 25, అక్టోబర్ 1న మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ దశాబ్దంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలతో పాటు వారి వారసులు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. వీరిలో ఇల్తిజా ముఫ్తీ కూడా ఒకరు.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు అయిన మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ. పీడీపీలో యువనేత అయిన ఇల్తిజాను ఆ పార్టీ కంచుకోట బిజ్ బెహారా నుంచి ఎన్నికల అరంగేట్రం చేయించేందుకు వీలుగా మొహబాబా ముఫ్తీ నిన్న కీలక ప్రకటన చేశారు. దక్షిణ కాశ్మీర్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ తరఫున ఇన్ ఛార్జ్ లను ఆమె ప్రకటించారు. ఇందులో తన కుమార్తె ఇల్తిజాకు బిజ్ బెహారా ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఇల్తిజా ఎన్నికల అరంగేట్రంపై చర్చ జరుగుతోంది.

Mehbooba Mufti s daughter Iltija set to make electoral debut in Jammu Kashmir polls

1996లో ఇదే బిజ్ బెహారా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మొహబుబా ముఫ్తీ ఎన్నికల అరంగేట్రం చేశారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఇదే సీటులో తిరిగి తన కుమార్తె ఇల్తిజాతో మెహబూబా ఎన్నికల అరంగేట్రం చేయిస్తున్నారు. ముఫ్తీల కుటుంబ కంచుకోట అయిన బిజ్ బెహారా సీటు నుంచి పోటీ చేయడం ద్వారా సునాయాసంగా తొలి విజయం అందుకోవాలని ఇల్తిజా కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే సీటు నుంచి 1967లో ఇల్తిజా తాత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా గెలిచారు. దీంతో ముఫ్తీల కుటుంబం నుంచి ఈ సీటులో పోటీ చేస్తున్న మూడోతరం నాయకురాలిగా ఇల్తిజా రికార్డులకెక్కారు.

Mehbooba Mufti s daughter Iltija set to make electoral debut in Jammu Kashmir polls

వాస్తవానికి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకునే పనిలో బిజీగా ఉన్న మెహబూబా ముఫ్తీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె కుమార్తె ఇల్తిజా దక్షిణ కాశ్మీర్‌లో పార్టీకి కీలకంగా మారారు.. ఈ ఏడాది మెహబూబా ముఫ్తీ దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+