మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. టికెట్ రేట్లు 50 శాతం పెంపు

మెట్రోలో నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం మెట్రో ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఏ ప్రదేశానికైనా వేగంగా వెళ్లాలంటే అందరికీ ఫస్ట్ గుర్తుకువచ్చేది మెట్రోనే. అయితే ఇప్పుడు మెట్రో ప్రయాణం భారంగా మారనుంది. ఇకపై మెట్రో ఎక్కాలంటే జేబును తడుముకోవాల్సిందే. అవును 2025, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మెట్రో టికెట్ ధరలను దాదాపు 50 శాతం పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచే నూతన టికెట్ రేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఛార్జీల స్థిరీకరణ కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను పెంచినట్లు బెంగుళూరు మెట్రో యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేక మెట్రోను ఆశ్రయిస్తుంటే.. చార్జీల పెంపు పేరుతో సామాన్యులపై భారం మోపడం సరికాదంటున్నారు.

Metro Fare Hike in Bengaluru Passengers Face 50 Surge Starting Today
మెట్రో స్మార్ట్ కార్డు ఉన్నవారికి 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. స్మార్ట్ కార్డులపై పీక్ అవర్‎లో 5 శాతం, నాన్ పీక్ అవర్‎లో 10 శాతం డిస్కౌంట్ వర్తించనుందని స్పష్టం చేశారు. ఇక ఆదివారాలు, జాతీయ సెలవు దినాలలో స్మార్ట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని వివరించారు. బెంగళూరు మెట్రో అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం మెట్రో టికెట్ గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.90 కు చేరుకుంది.

మెట్రో ఛార్జీల ధరలు సవరించిన తర్వాత..

0-2 కి.మీ: రూ. 10
2-4 కి.మీ: రూ. 20
4-6 కి.మీ: రూ. 30
6-8 కి.మీ: రూ. 40
8-10 కి.మీ: రూ. 50
10-12 కి.మీ: రూ. 60
15-20 కి.మీ: రూ. 70
20-25 కి.మీ: రూ. 80
25-30 కి.మీ మరియు అంతకంటే ఎక్కువ: రూ.90

ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం మేర పెంచింది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో టికెట్ ధరలను కూడా పెంచడంపై ప్రయాణకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+