స్పీడ్‌ బ్రేకర్లను ఎత్తుకెళ్లిన దొంగలు! ఇదెక్కడి మస్ రా మామ

దొంగలు రోజురోజుకు విచిత్రంగా మారిపోతున్నారు. ఇంట్లో చోరీలు, వాహనాలను తస్కరించడం, ఏటీఎంను కొల్లగొట్టడం వరకు సాధారణంగా మనం రోజూ వింటున్నవే. అయితే కొందరు జంతువుల్ని, పూల మొక్కల్ని కూడా లేపేస్తుంటారు. ఇక పార్కుల్లో బెంచులు, పోస్ట్ బాక్స్ లు ఇలా ప్రభుత్వ ఆస్తులకైతే రక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు జరిగిన ఓ దొంగతనం వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పోలీసులు కూడా ఊహించని ఆ దొంగతనం.. అందరి చేత "ఇదేందిరయ్యా ఇది.. ఇది నేను చూడ్లా" అనేలా చేస్తుంది.

రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలను కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డుపై ఒక్కొ చోటు ఒక్కో లా ఉంటాయి. నేషనల్ హైవే రూల్స్ ప్రకారం హైవేపై స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు కాబట్టి స్పీడ్ కంట్రోల్ కోసం తాత్కాలికంగా ఎల్లో అండ్ కలర్లో ఉండే ఒక టైప్ ప్లాస్టిక్ వస్తువును ఉపయోగిస్తారు. వీటితో పాటుగానే కొన్ని చోట్ల రోడ్లపైనే లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇవి రాత్రి వేళల్లో బాగా ఉపయోగపడతాయి.

Midnight Heist Targets Roads Not Homes Speed Breakers Stolen in MP

అయితే ఇప్పుడు తాజాగా జరిగిన దొంగతనం ఈ స్పీడ్ బ్రేకర్లే.. మీరు చదివింది నిజమే.. స్పీడ్ బ్రేకర్స్ కూడా వదలకుండా దొంగలించేశారు. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో జరిగింది ఈ విచిత్రమైన చోరి. నగర రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ. 8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేక‌ర్‌లను దొంగలు రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు.

విదిషా నగరంలోని మెయిన్ రోడ్, దుర్గా నగర్ కూడలి, జిల్లా కోర్టు, వివేకానంద చౌక్ వంటి రద్దీ ప్రాంతాల నుంచి ఈ స్పీడ్ బ్రేకర్లు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాయి. నిత్యం రద్దీ, పోలీసు గస్తీ, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, దొంగలు ఎవరికీ తెలియకుండా వీటిని తీసుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగానే స్పీడ్ బ్రేకర్లు దొంగలించి ఏం చేసుకుంటారనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది.

"మెయిన్ రోడ్ పై స్పీడ్ బ్రేక‌ర్‌లనే దొంగిలించగలిగితే, సామాన్య పౌరులకు ఇంకేం భద్రత ఉంటుంది?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ నిఘా వ్యవస్థలు, రాత్రి వేళల్లో గస్తీ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణపై ప్రజలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన అధికారి దుర్గేష్ ఠాకూర్ ఈ దొంగతనాన్ని ధృవీకరించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, స్పీడ్ బ్రేక‌ర్‌లను ఎలా తొలగించి, అక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేశారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+