షాకింగ్: కరోనా సోకిన పురుషుల్లో సంతాన ఉత్పత్తి నో, పరిశోధకులు ఏం చెప్పారంటే
కరోనా వైరస్ ఇంఫాక్ట్ తగ్గిన.. దానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అవును కరోనా సోకిన తర్వాత ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అవును కరోనా సోకిన పురుషులకు పిల్లలు పుట్టరనే సంచలన విషయాన్ని ఐఐటీ బొంబాయి శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది.

స్టడీ చేయగా..
వైరస్ వచ్చి కోలుకున్న పురుషులపై అధ్యయనం చేశారు. చేయగా సంచలన విషయం తెలిసింది. కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని తెలిపారు. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలో కూడా సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని పేర్కొన్నారు. పురుషుల వీర్యకణాలపై చేసిన పరిశోధనను ఏసీఎస్ ఒమెగా జర్నల్ ప్రచురించింది. ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు కలిసి చేశారు.

ఇతర వ్యవస్థలపై ప్రభావం
కరోనాకు కారణమైన సార్స్-2 వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతోపాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. వైరస్ వల్ల పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తేలిందని పేర్కొన్నారు. పది మంది ఆరోగ్యవంతులయిన పురుషుల వీర్యం.. పదిహేడు గురు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్య నమూనాలను విశ్లేషించి చూశారు. దీంతో తేడా స్పష్టంగా గమనించారు. ఇరువురు 20 నుంచి 45 ఏళ్ల వయస్సు గల వారిని తీసుకున్నారు.

తగ్గిన వీర్య కణాలు
ఆరోగ్యవంతులతో పోల్చగా.. కరోనా సోకిన వారిలో వీర్య కణాలు తగ్గాయని అధ్యయనంలో తేలింది. సంతాన ఉత్పత్తికి సంబంధించి రెండు ప్రోటీన్లు.. సెమెనోజెలిన్ 1, ప్రోసాపోసిన్ కోలుకున్న వారిలో తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వివరించారు. వీటిని నిర్థరించడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని పరిశోధకులు అంటున్నారు. కానీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. కరోనా సోకిన వారిలో సంతానం కలిగే అవకాశాలు తక్కువే.

మరో మార్గంలో..
కరోనా సోకి.. పిల్లలు లేని పురుషులకు ఇదీ నిజంగా ఛేదు వార్తే. అవును లేదంటే వారు సంతానం అవకాశాలు కోల్పోతారు. మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉన్నా.. ప్రాథమికంగా మాత్రం ఛాన్సెస్ తక్కువే.. సో వారు ఇతర మార్గాల్లో పిల్లలను కనాల్సి ఉంటుందని పరిశోధకులు సజెస్ట్ చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్ మోడల్స్ ఉన్నాయని చెబుతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications