కన్నతల్లి కంటే కామం ఎక్కువైందా.. మైనర్ కుమార్తె సిగ్గుమాలిన పని !!

బెంగళూరులో చోటుచేసుకున్న ఓ ఘోర ఘటన సభ్య సమాజాన్ని సైతం ఆందోళనలోకి నెట్టింది. అబ్బాయికి దూరంగా ఉండమన్నందుకు ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లిని హత్య చేసిన సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతే కాకుండా ఆ తర్వాత ఆ హత్యను కప్పిపుచ్చేందుకు ఆడిన నాటకం సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మైనర్ ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న నేత్రావతి (35) లోన్ రికవరీ సంస్థలో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఒక కుమార్తె ఉండగా.. తన వయసు 17 సంవత్సరాలు. ఇటీవల ఆ బాలిక ఓ యువకుడితో స్నేహం పేరుతో సన్నిహితంగా ఉంటుంది. కుమార్తె ప్రవర్తనలో మార్పు గమనించిన నేత్రావతి స్నేహితులతో బయట తిరగొద్దని మందలించింది. అయితే ఒకరోజున ఇంట్లో యువకుడితో కుమార్తె ఏకాంతంగా ఉండటాన్ని నేత్రావతి చూసింది. దీంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

minor-daughter-killed-mother-with-help-of-boyfriend-at-bangalore

ఈ క్రమంలోనే తమ బంధానికి తల్లి అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి హత్యకు కుట్రపన్నింది. అక్టోబర్ 25న తన ప్రియుడితో పాటు ఇంకా నలుగురు యువకులను ఇంటికి పిలిపించింది. తల్లి నిద్రలో ఉండగా టవల్‌తో గొంతు బిగించి చంపేశారు. అనంతరం ఇది ఆత్మహత్యగా చూపించేందుకు చీరతో ఆమె శరీరాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత నేత్రావతి సోదరి ఇంటికి వచ్చి చూడగా.. ఫ్యాన్ కి వేలాడుతూ ఉండటంతో షాక్‌కు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది.

దర్యాప్తులో బయటపడ్డ నిజం..

కాగా మొదట ఇది ఆత్మహత్యగా అనిపించినా.. సుబ్రహ్మణ్యపుర పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. శరీరంపై ఉన్న గాయాలు, ఫ్యాన్ ఎత్తు, చీర కట్టిన విధానం అన్నీ అనుమానాలను రేకెత్తించాయి. పోస్టుమార్టం రిపోర్ట్‌లో గొంతు బిగించి చంపారని నిర్ధారణ అయ్యింది. అలానే సంఘటన జరిగిన రోజున ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా, బాలికతో పాటు నలుగురు యువకులు ఇంట్లోకి వెళ్లిన ఫుటేజ్ కూడా బయటపడింది. దాంతో నిజం వెలుగులోకి వచ్చింది.

హత్యలో బాలికతో పాటు నలుగురు మగ స్నేహితులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరంతా మైనర్లు కావడంతో, జువైనైల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, వారిని జువైనైల్ హోమ్‌కి తరలించారు. బాలికకు ఆ యువకుడు పరిచయం కావడానికి కారణం ఒక బంధువు అని తేలింది. ఆ పరిచయం ప్రేమగా మారి, తరచూ ఇంటికి వచ్చేవాడని విచారణలో వెల్లడైంది. ఈ ఘటన చిన్న వయసులో ప్రేమ, సంబంధాలు, స్నేహాల మధ్య సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి దారుణాలకు దారితీస్తోందని రుజువు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+