అదృశ్యమై, సెక్స్ రాకెట్ వారి చేతిలో చిక్కుకొన్న బంగ్లాదేశ్ బాలిక..
బెంగళూరు: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలిక సెక్స్ రాకెట్ నడుపుతున్న వారి చేతిలో చిక్కుకొని, ఆ తర్వాత జైలుకు వెళ్లిన అనంతరం దాదాపు ఏడు నెలల తర్వాత ఇప్పుడు ఇంటికి వెళుతోంది. ఈ బాధిత బాలిక బెంగళూరు సెక్స్ రాకెట్ నడుపుతున్న వారి చేతికి చిక్కింది. అనంతరం కేరళలో జైలుకు వెళ్లింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తన ఇంటికి వెళుతోంది.
కోజీకోడ్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలికను వెంటనే బంగ్లాదేశ్‌కు తిప్పి పంపించాలని సూచించింది. బాలికను క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది.
బాధిత బాలిక బంగ్లాదేశ్‌లోని శత్రాపూర్‌కు చెందినది. ఆమె మే నెలలో ఇంటి నుండి అదృశ్యమైంది. ఇంటి నుండి అదృశ్యమైన ఆమె కోల్‌కతాకు చేరింది. అక్కడి నుండి ఉద్యోగం నిమిత్తం బెంగళూరుకు చేరుకుంది. బెంగళూరులో ఆమె ఓ సెక్స్ రాకెట్ నడుపుతున్న వారికి చిక్కింది.

వారు కోజీకోడ్ జిల్లాలోని మరో సెక్స్ రాకెట్ వారి చేతికి అప్పగించారు. అక్కడ ఆమె పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుండి ఆమె బయటపడింది. ఓ బస్సులో బెంగళూరుకు బయలుదేరింది. ఆమె థమరస్సరే ప్రాంతంలో ఆహారం కోసం దిగింది. ఆ రోజు మే 12.
ఆమెను బంగ్లాదేశీగు గుర్తించారు. ఆమె వద్ద పాస్ పోర్టు లేకపోవడంతో అరెస్టు చేశారు. ఆమె వయస్సు గురించి సరిగా తెలియకపోవడంతో పోలీసులు ఆమె వయస్సును 20గా పేర్కొన్నారు.
అనంతరం కొన్ని ఎన్జీవో సంఘాలు, అధికారులు ఆమె బర్త్ సర్టిఫికేట్ తీసుకు వచ్చారు. దీంతో ఆమె వయస్సు 17గా తేలింది. దీంతో ఆమెను విడుదల చేశారు. ఆమెను బంగ్లాదేశ్‌లోని తన ఇంటికి సురక్షితంగా పంపించే బాధ్యతను అధికారులకు అప్పగించారు. కాగా, ఇప్పుడు ఆమె ఏడు నెలల గర్భవతి అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications