జార్ఖండ్‌లో దారుణం: సహాయం కోసం అర్థిస్తే...అత్యాచారం చేశారు

జార్ఖండ్ : సహాయం చేయాల్సిందిగా కోరితే వారికి సహాయం చేయకపోగా వారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన జార్ఖండ్ రాష్ట్రం లోహర్దగాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఇద్దరు మైనర్ అమ్మాయిలు తమ బంధువైన ఒకాయనతో కలిసి మోటార్ సైకిల్ ‌పై వెళుతున్నారు. కొంత దూరం చేరుకోగానే మోటార్ సైకిల్ చెడిపోయింది. అక్కడే చాలాసేపు వరకు దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎంతసేపటికీ అది స్టార్ట్ కాలేదు. ఇక దారి మధ్యలో ఉన్న తమకు ఏమి చేయాలో పాలుపోలేదు.

అంతలోనే ఆ మైనర్ అమ్మాయిలతో పాటు వచ్చిన ఆ వ్యక్తి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తమ బైక్ చెడిపోయిందని వెంటనే సహాయం చేయాల్సిందిగా కోరాడు. అయితే ఆ వ్యక్తి సహాయం చేయకపోగా... బాధితులున్న ప్రాంతానికి తనతో ఉండే 11 మంది స్నేహితులను పంపాడు. అక్కడికి చేరుకున్న 11 మంది మైనర్ బాలికలకు తోడుగా ఉన్న వ్యక్తిని చితకబాది దూరంగా పడేశారు. అనంతరం ఈ మైనర్ బాలికలను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు.

Minors who asked for help were raped by 11 men in Jharkhand

మైనర్ బాలికలు గట్టిగా కేకలు వేశారు. వదలమని ప్రాధేయపడ్డారు. అయినా కనికరించలేదు కామాంధులు. కేకలు విని ఎవరైనా వచ్చి సహాయం చేస్తారనుకున్న అమ్మాయిలకు నిరాశే మిగిలింది. ఆ ప్రాంతంలో జనాలు పెద్దగా తిరగరు. దీన్నే అదునుగా తీసుకున్నారు కామాంధులు. బాలికలపై మృగంలా ప్రవర్తించారు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం 11 మంది ఆ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డ తర్వాత అమ్మాయిల నుంచి మొబైల్ ఫోన్లు కూడా లాకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారి ఫోన్లు నిందితుల ఇంట్లో దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పిన పోలీసులు మొత్తం 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+